హ్యుందాయ్ వెన్యూ నైట్‌: ధర ఎంతంటే? | 2026 Hyundai Venue Knight Launched at Rs 9 70 Lakh | Sakshi
Sakshi News home page

హ్యుందాయ్ వెన్యూ నైట్‌ లాంచ్: ధర ఎంతంటే?

Apr 20 2026 4:11 PM | Updated on Apr 20 2026 4:23 PM

2026 Hyundai Venue Knight Launched at Rs 9 70 Lakh

హ్యుందాయ్ మోటార్ ఇండియా.. 2026 వెన్యూ నైట్‌ను రూ. 9.70 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది. ఇది పూర్తిగా నలుపు రంగులో ఉండటం చేత.. చూడటానికి సాధారణ వెన్యూ కంటే కొంత భిన్నంగా అనిపిస్తుంది.

హ్యుందాయ్ వెన్యూ నైట్‌.. నలుపు రంగు ఫ్రంట్ గ్రిల్, రూఫ్ రైల్స్, ఓఆర్వీఎంలు పొందుతుంది. అంతే కాకుండా.. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ నలుపు రంగులోని 16 అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. అయితే బ్రేక్ కాలిపర్స్ ఎరుపు రంగులో ఉన్నాయి. ఇది మ్యాట్ బ్లాక్ హ్యుందాయ్ లోగోలు, ప్రత్యేకమైన నైట్ లోగోలు పొందుతుంది.

వెన్యూ నైట్ ఇంటీరియర్ కూడా నలుపు రంగులోనే ఉంది. ఇందులో ఫీచర్స్ అన్నీ కూడా సాధారణ వెన్యూలో మాదిరిగానే ఉంటాయి. రంగులో మాత్రం వ్యత్యాసం కనిపిస్తుంది. ఇందులో డ్రైవింగ్, ఎమర్జెన్సీ & ఈవెంట్, వెకేషన్, ఆన్-డిమాండ్ మరియు ఫోటో క్యాప్చర్ వంటి బహుళ రికార్డింగ్ మోడ్‌లు ఉన్నాయి.

2026 హ్యుందాయ్ వెన్యూ, పాత వెర్షన్‌లోని అవే ఇంజన్‌లతో అందుబాటులో ఉంది. కాబట్టి 1.2-లీటర్ పెట్రోల్, డీసీటీతో జత చేసిన 1.0-లీటర్ టర్బో-పెట్రోల్,  మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చే 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement