పక్కింటి మహిళపై సీఐ చిన్నమల్లయ్య అత్యాచారం | Palnadu District Vinukonda CI Chinmayi Issue | Sakshi
Sakshi News home page

పక్కింటి మహిళపై సీఐ చిన్నమల్లయ్య అత్యాచారం

Apr 30 2026 7:52 AM | Updated on Apr 30 2026 11:46 AM

 Palnadu District Vinukonda CI Chinmayi Issue

పల్నాడు జిల్లా: గతంలో పల్నాడు జిల్లా వినుకొండ సీఐగా పనిచేసిన చిన్నమల్లయ్య తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బుధవారం ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... పల్నాడు జిల్లా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లిలో సీఐకి చెందిన స్థలాన్ని లీజుకు తీసుకొని కోళ్ల ఫారం నిర్వహిస్తున్నామని తెలిపింది. లీజు డబ్బుల కోసం వచ్చిన చిన్నమల్లయ్య తనపై లైంగిక దాడి చేశాడని  ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను కోరింది. వినుకొండ సీఐ ప్రభాకరరావు విచారణ చేపట్టారు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement