నేడు సీఎం జగన్‌ కొవ్వూరు పర్యటన

CM YS Jagan To Visit Kovvur For Jagananna Vidya Deevena - Sakshi

సాక్షి, అమరావతి/కొవ్వూరు : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం (నేడు) తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్నారు. అక్కడ జరిగే కార్యక్రమంలో ఆయన జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేస్తారు. ఉ.8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి కొవ్వూరు చేరుకుంటారు.

అక్కడ సత్యవతినగర్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్‌ నగదు జమచేస్తారు. అనంతరం కొవ్వూరు నుంచి బయల్దేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top