ఎవరికి ఎప్పుడు అదృష్టం కలిసొస్తుందో, ఎంతలా ఫేమస్ అవుతారో ఊహించలేం
తమిళ హీరోయిన్ దుషారా విజయన్‌కి ఇలాంటి అదృష్టం పట్టేసిందని చెప్పొచ్చు
అక్టోబర్ 14న ఈ బ్యూటీది పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈమె గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు
తమిళనాడులోని దిండిగుల్ అనే ఊరిలో దుషారా పుట్టి పెరిగింది. ఇంజినీరింగ్ చదవాలనుకుంది
కానీ సినిమాలపై ఇష్టంతో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకుంది. అలా సినిమాల్లోకి వచ్చింది
2019లో 'బోధై యెరి బుద్ధి మారి' అనే సినిమాతో నటిగా మారింది. తొలి చిత్రానికే మంచి గుర్తింపు దక్కింది
కరోనా టైంలో అంటే 2021లో వచ్చిన 'సార్పట్టా పరంపర' మూవీ ఈమెకు పేరు తీసుకొచ్చింది
దీని తర్వాత రెండు మూడు మూవీస్ చేసింది. కానీ 2024 ఈమెకు చాలా స్పెషల్ అని చెప్పాలి
'రాయన్' మూవీలో ధనుష్‌కి చెల్లిగా కీలక పాత్రలో నటించి అదరగొట్టేసింది
ఈ రెండు చిత్రాలు తెలుగులో పెద్దగా ఆడనప్పటికీ తమిళంలో మాత్రం హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి
అలా తమిళ ఇండస్ట్రీకి వచ్చిన ఐదేళ్లలోనే దుషారా స్టార్‌డమ్ సంపాదించేసింది
ఈమెని చూస్తే డస్కీ బ్యూటీలా అనిపిస్తుంది. కానీ చీర కట్టినా మోడ్రన్ డ్రస్ వేసినా గ్లామర్‌లో అదరగొట్టేస్తుందంతే!


