తమ్ముడు లేచిపోయాడని.. అక్కను చంపేశారు! | Dalit woman murdered in suspected case of honour killing | Sakshi
Sakshi News home page

తమ్ముడు లేచిపోయాడని.. అక్కను చంపేశారు!

May 13 2016 8:26 PM | Updated on Sep 4 2017 12:02 AM

తమ్ముడు లేచిపోయాడని.. అక్కను చంపేశారు!

తమ్ముడు లేచిపోయాడని.. అక్కను చంపేశారు!

తమిళనాడులో మరో పరువు హత్య జరిగింది. దళిత కులానికి చెందిన ఓ యువకుడు.. అగ్రకులానికి చెందిన యువతిని ప్రేమించినందుకు అతడి అక్కను నరికి చంపారు.

తమిళనాడులో మరో పరువు హత్య జరిగింది. దళిత కులానికి చెందిన ఓ యువకుడు.. అగ్రకులానికి చెందిన యువతిని ప్రేమించినందుకు అతడి అక్కను నరికి చంపారు. విశ్వనాథన్ (25) అనే యువకుడు అగ్రకులానికి చెందిన యువతిని ప్రేమించి, ఆమెతో పారిపోయాడు. దాంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

వాళ్లంతా విశ్వనాథన్ ఇంటికి వచ్చి చూసినా, అతడు అక్కడ లేడు. అతడి అక్క కల్పన వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తుండగా ఆమెను వాళ్లు నరికి చంపారు. ఆమెకు పెళ్లయ్యి, ఓ కూతురు కూడా ఉంది. ఇంతకుముందు మార్చి 13వ తేదీన కూడా తమిళనాడులో ఓ పరువు హత్య జరిగింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement