పోలీసులు అప్రమత్తం | Polices alert | Sakshi
Sakshi News home page

పోలీసులు అప్రమత్తం

Apr 5 2015 4:21 AM | Updated on Aug 21 2018 7:53 PM

నల్లగొండ జిల్లాలో జరిగిన కాల్పుల సంఘటన, ఎన్‌కౌంటర్ నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యూరు.

నల్లగొండ సంఘటనల నేపథ్యంలో
సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిన ఎస్‌పీ


నిజామాబాద్ క్రైం : నల్లగొండ జిల్లాలో జరిగిన కాల్పుల సంఘటన, ఎన్‌కౌంటర్ నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యూరు. ఒకప్పుడు పోలీసులకు నక్సలైట్లకు మధ్య కాల్పులు జరిగేవి. ఇప్పు డు పోలీసులకు దుండగులకు మధ్య కాల్పులు జరుగటం సంచలనం రేపుతోంది. గతంలో తీవ్రవాదుల వద్ద మారణాయుధాలు ఉండటంతో పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించేవారు. ఇప్పుడు దుండగులు, చిల్లర ముఠాలు సైతం తుపాకులు వాడుతుండటంతో పోలీసుశాఖ విస్తుపోతోంది.

నల్లగొండ జిల్లాలో దుండగులు దేశవాళీ తుపాకులతో కాల్పులు జరపటంతో పోలీసుశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనిని దృష్టిలో పె ట్టుకుని ఎస్‌పీ చంద్రశేఖర్‌రెడ్డి పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. అనుమానిత ప్రాంతాలలో నిఘా ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల క్రితం సూర్యాపేట్  బస్టాండ్‌లో జరిగిన కాల్పులలో గాయపడిన సీఐ మొగులయ్యది మన జిల్లానే. జుక్కల్ మండలం ఖండేబల్లేర్  గ్రామానికి చెందిన మొగులయ్య, హోంగార్డు కిషోర్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

జిల్లాకు పొరుగు రాష్ట్రాల సరిహద్దులు సమీపంలో ఉండడంతో పోలీసు అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల రాకపోకలపై దృష్టి సారిస్తున్నారు. నల్ల గొండ జిల్లాలో జరిగిన రెండు సంఘటనల క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లా పోలీసులకు తగు సూచనలు జారీ చేసింది. దీంతో జిల్లాలోని అన్ని ఠాణాలకు సమా చారం పంపించి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement