‘హరీశ్‌రావుకు పిల్ల చేష్టలు పోలేదు’ | MLA Jagga Reddy Comments On Minister Harish Rao | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం పోతోంది: జగ్గారెడ్డి

Jul 14 2020 5:08 PM | Updated on Jul 14 2020 6:25 PM

MLA Jagga Reddy Comments On Minister Harish Rao - Sakshi

సాక్షి, సంగారెడ్డి: ప్రభుత్వ వైద్యశాలలపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లి పోతుందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాసుపత్రులపై ప్రజలకు విశ్వాసం కలిగించాలని కోరారు. ‘‘సంగారెడ్డికి వచ్చి కలెక్టర్‌ కార్యాలయంలో సమీక్షలు పెట్టడం కాదు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమావేశాలు నిర్వహించి నమ్మకం కలిగించాలని’’ హరీశ్‌‌రావును ఉద్దేశించి అన్నారు. ‘‘కరోనా పేరు మీద సంగారెడ్డికి వచ్చి కాంగ్రెస్‌ నాయకులను టీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఇలా చేయడం సిగ్గుగా లేదా.. హరీశ్‌రావుకు ఇంకా చిన్న పిల్లల చేష్టలు పోలేదంటూ’’ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement