ఖాలీద్ కన్నుపడితే.. | Khalid followers rape Burglaries | Sakshi
Sakshi News home page

ఖాలీద్ కన్నుపడితే..

Feb 28 2016 2:29 AM | Updated on Jul 28 2018 8:53 PM

ఖాలీద్ కన్నుపడితే.. - Sakshi

ఖాలీద్ కన్నుపడితే..

కరీంనగర్‌కు చెందిన కరుడుగట్టిన నేరస్తుడు ధూం ఖాలీద్ నగర శివారు ప్రాంతాల్లో మాటువేసి రేప్‌లు, దోపిడీలు ...

కరీంనగర్‌కు చెందిన కరుడుగట్టిన నేరస్తుడు ఖాలీద్ గ్యాంగ్ ఇటీవల నగర శివారులో
ఓ విద్యార్థినిని చెరబట్టింది.

 
కరీంనగర్ క్రైం : కరీంనగర్‌కు చెందిన కరుడుగట్టిన నేరస్తుడు ధూం ఖాలీద్ నగర శివారు ప్రాంతాల్లో మాటువేసి రేప్‌లు, దోపిడీలు చేస్తుంటాడు. ఇప్పటికి పదుల సంఖ్యలో అమ్మారుులను చెరబట్టిన ఇతడి గ్యాంగ్ ఇటీవల ఓ ఇంటర్ విద్యార్థినిని చెరిచింది. నగరానికి చెందిన విద్యార్థిని పెద్దపల్లి బైపాస్ రోడ్డు ప్రాంతంలో వెళ్తుండగా.. ఖాలీద్, అతడి అనుచరులు ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికదాడి చేశారు. అనంతరం ఖాలీద్‌తో అనుచరులకు గొడవ జరగడంతో అతడిపై దాడి చేసి కొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఖాలీద్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అతడి కాళ్లకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో ఓ కాలిని తొలగించాల్సి వస్తున్నట్లు సమాచారం. ఖాలీద్‌తోపాటు అతడి అనుచరులు పోలీసు శాఖలోని కొంతమంది బంధువుల అండతో రెచ్చిపోతున్నట్లు ఆరోపణలున్నారుు. అలాగే ఓ రాజకీయ పార్టీ నాయకులు వారి ఆగడాలకు అండగా నిలుస్తున్నారనే విమర్శలున్నారుు. కాగా.. తాజా ఘటన నేపథ్యంలో పోలీసులు ఖాలీద్ గ్యాంగ్‌పై నిర్భయ కేసు నమోదు చేశారు. ఇప్పటికైనా వీరిని కఠినంగా శిక్షించాలని పలువురు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement