వంద స్ధానాల్లో గెలుస్తాం : కేసీఆర్‌

Kcr Says Trs Will Win In Hundred Segments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :టీఆర్‌ఎస్‌ వంద స్ధానాల్లో విజయం సాధిస్తుందని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. 50 రోజుల్లో వంద సభలను ఏర్పాటు చేసి తమ ఆలోచనలను ప్రజల ముందుంచుతామన్నారు. టీఆర్‌ఎస్‌ భవన్‌లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో విపక్షాలపై విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నడూ పేదల గురించి ఆలోచించదని ఆరోపించారు. సమైక్య పాలనలో సంక్షేమం కుంటుపడటంతో తాము అణగారిన వర్గాలను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పుకొచ్చారు. సంపద పెంచడం..పేదలకు పంచడం తమ విధానమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని విపక్షాలకు సవాల్‌ విసిరారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top