ఒక్క కారు.. 66 చలాన్లు

66 Challans on Car And Traffic Police Seized Car - Sakshi

రూ.75,710 బకాయి ఉన్నట్లు గుర్తింపు  

బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు మంగళవారం జూబ్లీహిల్స్‌ క్లబ్‌ సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. నల్లకుంట పద్మాకాలనీకి చెందిన కంద్రకొండ కోటేశ్వరరావుకు చెందిన కారు(ఏపీ09సీబీ3132)ను ఆపి తనిఖీలు చేయగా ఈ కారుపై 66 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. గత నాలుగేళ్లుగా పెండింగ్‌ చలానాలు చెల్లించకపోవడంతో బకాయిలు రూ.75,710 పేరుకుపోయాయి. దీంతో కారును సీజ్‌ చేశారు. నాగేశ్వరరావుకు చెందిన ఈ కారును మరో వ్యక్తి నడుపుతూ పట్టుబడ్డట్లు పోలీసులు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top