వెటెల్ ‘ఫినిషింగ్’ టచ్ | Sebastian Vettel wins season-ending Brazilian Grand prix | Sakshi
Sakshi News home page

వెటెల్ ‘ఫినిషింగ్’ టచ్

Nov 25 2013 1:45 AM | Updated on Sep 2 2017 12:57 AM

వెటెల్ ‘ఫినిషింగ్’ టచ్

వెటెల్ ‘ఫినిషింగ్’ టచ్

ఈ సీజన్ ఫార్ములావన్‌ను రెడ్‌బుల్ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ఘనంగా ముగించాడు. ఆదివారం జరిగిన బ్రెజిల్ గ్రాండ్‌ప్రిలోనూ విజయం సాధించి...

సావోపాలో: ఈ సీజన్ ఫార్ములావన్‌ను రెడ్‌బుల్ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ఘనంగా ముగించాడు. ఆదివారం జరిగిన బ్రెజిల్ గ్రాండ్‌ప్రిలోనూ విజయం సాధించి... ఒకే సీజన్‌లో వరుసగా తొమ్మిదో టైటిల్ నెగ్గాడు. ఈ ఘనత సాధించిన తొలి రేసర్ వెటెల్. అలాగే వెటెల్ సీజన్‌లో మొత్తం 19 రేస్‌లకు గాను 13 రేసుల్లో విజయం సాధించాడు. ఒకే సీజన్‌లో 13 టైటిల్స్ గెలిచిన షుమాకర్ (2004) రికార్డును  సమం చేశాడు.  
 
 ఆదివారం పోల్ పొజిషన్‌తో రేసును ప్రారంభించిన వెటెల్... 71 ల్యాప్‌లను గం.1:32ని,36.300 సెకన్లలో పూర్తి చేశాడు. రెడ్‌బుల్‌కే చెందిన వెబెర్ రెండో స్థానంలో నిలవగా.... ఫెరారీ రేసర్ అలోన్సో మూడో స్థానంలో నిలిచాడు. ఫోర్స్ ఇండియాకు చెందిన పాల్ డి రెస్టా 11వ, సుటిల్ 13వ స్థానంలో నిలిచారు.
 

Advertisement

పోల్

Advertisement