బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ | Pakistan won the toss and starts batting | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్

Mar 2 2016 7:00 PM | Updated on Mar 23 2019 8:33 PM

ఖుర్రం మంజూర్, షార్జిల్ ఖాన్ ఓపెనర్లుగా దిగి పాక్ బ్యాటింగ్ ప్రారంభించారు.

మిర్పూర్: ఖుర్రం మంజూర్, షార్జిల్ ఖాన్ ఓపెనర్లుగా దిగి పాక్ బ్యాటింగ్ ప్రారంభించారు. ఆసియా కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగే టీ20 మ్యాచ్ లో పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బంగ్లా బౌలర్ టస్కీన్ అహ్మద్ చేతికి కెప్టెన్ మొర్తాజా బంతిని అందించాడు. ఛేజింగ్ లో గత మూడు మ్యాచ్ లలో ఓడిన బంగ్లా ఈ మ్యాచ్ లో సంచలనం సృష్టించి పాక్ ను ఇంటిదారి పట్టిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

పాక్, బంగ్లా జట్లలో చిన్న మార్పులు చోటుచేసుకున్నాయి. మహమ్మద్ నవాజ్ స్థానంలో అన్వర్ అలీ జట్టులోకి వచ్చాడు. అలాగే బంగ్లా జట్టులో తమీమ్ ఇక్బాల్, ఆరాఫత్ సన్నీ స్థానం దక్కించుకోగా, నురల్ హసన్, ముస్తాఫిజర్ లు తుదిజట్టులో చోటు కోల్పోయారు. టాస్ గెలిస్తే తాను కూడా బ్యాటింగ్ ఎంచుకునే వాడినని బంగ్లా కెప్టెన్ మష్రాఫే మోర్తాజా చెప్పడం గమనార్హం. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement