టైటిల్‌ పోరుకు లాస్య, నైనా

Naina, Lasya to Fight in Title of State Ranking TT - Sakshi

స్టేట్‌ ర్యాంకింగ్‌ టేబుల్‌టెన్నిస్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: ఆనంద్‌నగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ స్పోర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యలో జరుగుతోన్న స్టేట్‌ ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో లాస్య (ఏడబ్ల్యూఏ), నైనా (ఎల్బీ స్టేడియం) ఫైనల్‌కు చేరుకున్నారు. ఖైరతాబాద్‌లో సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీస్‌ మ్యాచ్‌ల్లో లాస్య 7–11, 7–11, 11–6, 11–9, 7–11, 11–4, 11–6తో జి. ప్రణీత (హెచ్‌వీఎస్‌)పై గెలుపొందగా, నైనా 9–11, 11–1, 6–11, 11–7, 11–9, 11–5తో ఎం. మౌనిక (జీఎస్‌ఎం)ను ఓడించింది. పురుషుల విభాగంలో మొహమ్మద్‌ అలీ (ఎల్బీ స్టేడియం), అమన్‌ రహమాన్‌ (ఏవీఎస్‌సీ) తుదిపోరుకు చేరుకున్నారు. సెమీస్‌ మ్యాచ్‌ల్లో మొహమ్మద్‌ అలీ 11–8, 11–4, 12–10, 8–11, 11–8తో అలీ మొహమ్మద్‌పై, అమన్‌ 11–8, 13–11, 11–8, 11–13, 11–13, 12–10తో వి. చంద్రచూడ్‌ (ఎంఎల్‌ఆర్‌)పై గెలుపొందారు.  

ఇతర కేటగిరీ సెమీఫైనల్‌ మ్యాచ్‌ల ఫలితాలు

క్యాడెట్‌ బాలికలు: నిఖిత (వీపీజీ) 11–6, 11–5, 11–5, 11–3తో ధ్రితి (జీఎస్‌ఎం)పై, కావ్య (ఏడబ్ల్యూఏ) 6–11, 12–10, 11–7, 11–5, 11–7తో ప్రగ్యాన్ష (వీపీజీ)పై నెగ్గారు.  

బాలురు: జతిన్‌దేవ్‌ (ఎస్‌పీహెచ్‌ఎస్‌) 11–6, 11–7, 11–6, 11–4తో కార్తీక్‌ (నల్లగొండ)పై, శౌర్యరాజ్‌ సక్సేనా (ఎంఎల్‌ఆర్‌) 11–2, 11–7, 5–11, 11–4, 8–11, 11–4, 11–3తో పార్థ్‌ భాటియా (ఏడబ్ల్యూఏ)పై గెలిచారు.  
సబ్‌జూనియర్‌ బాలికలు: ఎన్‌. భవిత (జీఎస్‌ఎం) 11–7, 11–7, 11–9, 11–8తో ఇక్షిత (ఏడబ్ల్యూఏ)పై, విధి జైన్‌ (జీఎస్‌ఎం) 11–5, 11–7, 11–9, 11–9తో ప్రియాన్షి (జీఎస్‌ఎం)పై విజయం సాధించారు.  

బాలురు: కేశవన్‌ కన్నన్‌ (ఎంఎల్‌ఆర్‌)11–7, 9–11, 12–10, 11–8, 11–6తో అథర్వ (ఏడబ్ల్యూఏ)పై, ఎస్‌ఎస్‌కే కార్తీక్‌ (ఏడబ్ల్యూఏ) 11–8, 11–6, 11–8, 11–6తో ప్రణవ్‌ నల్లారి (ఏడబ్ల్యూఏ)పై ఆధిక్యం సాధించారు.  

జూనియర్‌ బాలికలు: ఐశ్వర్య డాగా (ఏడబ్ల్యూఏ) 11–9, 9–11, 2–11, 11–6, 11–4, 11–7తో అంజలి (జీఎస్‌ఎం)పై, సస్య (ఏడబ్ల్యూఏ) 9–11, 11–7, 11–9, 11–5, 11–7తో భవిత (జీఎస్‌ఎం)పై గెలుపొందారు.  

బాలురు: అద్వైత్‌ (ఏడబ్ల్యూఏ) 11–5, 11–7, 11–2, 11–7తో సాయినాథ్‌ రెడ్డి (ఎంఎల్‌ఆర్‌)పై, బి. వరుణ్‌ శంకర్‌ (జీటీటీఏ) 11–6, 4–11, 7–11, 11–8, 11–7, 11–7తో అమన్‌ రహమాన్‌ (ఏవీఎస్‌సీ)పై నెగ్గారు.  

యూత్‌ బాలికలు: జి. ప్రణీత (హెచ్‌వీఎస్‌) 12–10, 11–5, 7–11, 11–7, 11–9తో నైనా (ఎల్‌బీఎస్‌)పై, రచన (జీఎస్‌ఎం) 11–5, 8–11, 12–10, 5–11, 11–3, 1–11, 14–12తో లాస్య (ఏడబ్ల్యూఏ)పై గెలుపొంది ఫైనల్‌కు చేరుకున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top