భారత్‌ ఖేల్‌ ఖతం | Defeated by Bangla in the Under-19 Asia Cup | Sakshi
Sakshi News home page

భారత్‌ ఖేల్‌ ఖతం

Nov 15 2017 12:24 AM | Updated on Nov 15 2017 2:27 AM

Defeated by Bangla in the Under-19 Asia Cup - Sakshi

కౌలాలంపూర్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ అండర్‌–19 ఆసియా కప్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మంగళవారం ఇక్కడ జరిగిన గ్రూప్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో 8 వికెట్ల తేడాతో పరాజయంపాలు కావడంతో టీమిండియా కథ ముగిసింది. గత మ్యాచ్‌లోనూ భారత్, నేపాల్‌ చేతిలో ఓడింది. ఈ గ్రూప్‌లో భారత్‌ రెండు పాయింట్లతో మూడో స్థానంలో నిలువగా... నేపాల్, బంగ్లాదేశ్‌ సెమీస్‌కు అర్హత పొందాయి.

వర్షం కారణంగా 32 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ముందుగా భారత్‌ 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. సల్మాన్‌ ఖాన్‌ (39 నాటౌట్‌) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బంగ్లా 28 ఓవర్లలో 2 వికెట్లకు 191 పరుగులు చేసి విజయాన్నందుకుంది. పినాక్‌ ఘోష్‌ (81 నాటౌట్‌) అర్ధసెంచరీ సాధించగా, తౌహీద్‌ హృదయ్‌ (48 నాటౌట్‌) రాణించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు అభేద్యంగా 83 పరుగులు జోడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement