భళా... బంగ్లాదేశ్ | Bangladesh v England: Batsmen struggle as home side claim victory in second ODI | Sakshi
Sakshi News home page

భళా... బంగ్లాదేశ్

Oct 10 2016 1:19 AM | Updated on Sep 4 2017 4:48 PM

సొంతగడ్డపై తొలి వన్డేలో ఎదురైన పరాజయానికి బంగ్లాదేశ్ ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన రెండో మ్యాచ్‌లో

 రెండో వన్డేలో ఇంగ్లండ్ ఓటమి
 మిర్పూర్: సొంతగడ్డపై తొలి వన్డేలో ఎదురైన పరాజయానికి బంగ్లాదేశ్ ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 34 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. మహ్ముదుల్లా (75) టాప్ స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ మొర్తజా (44) రాణించాడు. వోక్స్, బాల్, రషీద్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం ఇంగ్లండ్ 44.4 ఓవర్లలో 204 పరుగులకే ఆలౌటైంది. బట్లర్ (57) అర్ధ సెంచరీ సాధించగా, బెయిర్‌స్టో (35) ఫర్వాలేదనిపించాడు. ఆదిల్ రషీద్ (33 నాటౌట్), జేక్ బాల్ (28)  చివరి వికెట్‌కు 45 పరుగులు జోడించి పోరాడినా లాభం లేకపోరుుంది. సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డే బుధవారం చిట్టగాంగ్‌లో జరుగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement