
సిరిసిల్లటౌన్: కేంద్రం అందిస్తున్న నిధులతోనే రాష్ట్రంలో కేసీఆర్ డబుల్‌బెడ్రూం పథకం అమలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బద్ధం బాల్‌రెడ్డి అన్నారు. గురువారం సిరిసిల్ల అయ్యప్ప ఫంక్షన్‌హాలులో పార్జీ జిల్లాస్థాయి ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు. మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా కేంద్రం నిర్ధిష్టంగా నిధులు అందించగా.. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వమ పథకాలుగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
అజీవన సహయోగ్ పథకం ప్రకారం పార్టీ సభ్యుల నుంచి నిధులు సేకరిస్తున్నామని తెలిపారు. పార్టీకి అందించే విరాళాలు చెక్కులు, డీడీలు, డిజిటల్ లావాదేవిల రూపంలోనే తీసుకోవడం జరుగుతుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, మహిళాధ్యక్షురాలు గడ్డం లత, అజీవన సహాయ నిధి ఇన్‌చార్జి విద్యాసాగర్, సిరిసిల్ల నియోజవర్గ ఇన్‌చార్జి అన్నల్‌దాస్ వేణు, గడ్డం భాస్కర్, గూడెల్లి వేణు, ఎనగంటి నరేష్, బాలసాని అనీల్ ఉన్నారు. కేంద్రం నిధులతోనే ‘డబుల్’ పథకం