158వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | Day 158 YS Jagan Padayatra Begins | Sakshi
Sakshi News home page

158వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

May 10 2018 9:11 AM | Updated on Jul 26 2018 7:14 PM

Day 158 YS Jagan Padayatra Begins - Sakshi

కృష్ణా జిల్లా పాదయాత్రలో వైఎస్‌ జగన్‌

సాక్షి, కైకలూరు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం 158వ రోజు పాదయాత్రను వైఎస్‌ జగన్‌ కైకలూరు నియోజకవర్గంలోని మండవల్లి మండలం పెరికెగూడెం నుంచి ప్రారంభించారు. ఆయన వెంట నడిచేందుకు వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. వారందరినీ ఆప్యాయంగా పలకరించి జననేత ముందుకు సాగారు.

కొర్లపాడు క్రాస్‌, గన్నవరం క్రాస్‌ల మీదుగా ఈరోజు పాదయాత్ర కొనసాగిస్తారు. తమ సమస్యలు తెలుసుకునేందుకు స్వయంగా వస్తున్న రాజన్న తనయుడికి జనం నీరాజనాలు పడుతున్నారు. తమ కష్టాలు మొరపెట్టుకుంటున్నారు. ప్రజల కష్టాలు వింటూ, వారికి భరోసాయిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. జిల్లా నాయకులు కూడా స్థానిక సమస్యలను వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకొస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement