అక్కడ అంతా అవినీతి కంపు... ఏ పని కావాలన్నా పైసలు ఇస్తేనే? లేదంటే ఇంతే సంగతులు!
అక్కడ అంతా అవినీతి కంపు... ఏ పని కావాలన్నా పైసలు ఇస్తేనే? లేదంటే ఇంతే సంగతులు! ఇక నగర సుందరీకరణ విషయానికి వస్తే తెరముందు ఒకమాట తెరవెనుక ఒకమాట! ప్రజల సంక్షేమం అక్కరలేదు. రోడ్లు గుంతల మయం, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలి ప్రజలు రోగాల బారిన పడినా ఏమీపట్టదు. కానీ అధికారుల అవినీతి కోట్లకు మించిపో యింది. కార్పొరేషన్ అవినీతి ఎంతగా ఉందంటే చెత్త ఎత్తే వాహనాల దగ్గర నుంచి భవనాల అనుమతుల వరకూ కూడా అధికారులు ఇష్టానుసా రంగా వ్యవహరించడం దారుణం. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి జవాబుదారిగా ఉండవలసిన కార్పొరేషన్ కరప్షన్ మయంగా తయారయిం ది. అడుగడుగునా లంచాల మయం.
ప్రతీ పనికి ఒక రేటు! మన కార్పొరేట్ ప్రబుద్ధులు ప్రజల సొమ్ము విచ్చలవిడిగా ఖర్చుచేస్త్త్తున్నా అడిగే నాథుడే లేడు.. విలాసాల యాత్రలు, కంపూటర్లు ఒకటేమిటి వీలైనంత దోచుకోవ డమే వీళ్ల పని. రోడ్లు వేయమంటే వేయరు, మురికివాడల సంగతి సరే సరి. ఏదీ చేయరు, కానీ కమీషన్ల కోసం అక్రమ మార్గాలలో సొమ్ము దోచుకోవడం మాత్రం తెలుసు.. ఈ మధ్య చెత్త ఎత్తే వాహనాల కుంభకోణం తెరమీదకు వచ్చింది. దీంట్లో అధికారులు కాంట్రాక్టర్లు కలసి 100 కోట్లు బొక్కేశారు. దొంగ బిల్లులు పెట్టి అడ్డంగా దోచుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అక్రమా ర్కులపై కొరడా ఝుళిపించి ఈ మురికి కంపును వదిలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆరోజు ఎప్పుడు వస్తుందో?
- ఉమా రాజిరెడ్డి,
వివేక్‌నగర్, హైదరాబాద్