కొడుకు స్కూల్కి వెళ్లటం లేదని...


చిన్న పిల్లలు ఎవరైన స్కూల్కు వెళ్లకపోతే ఎవరైన ఏం చేస్తారు. బుజ్జగించి లేదా కొప్పడి స్కూల్కు పంపుతారు. అలా కూడా మాట వినకపోతే చేత్తో రెండు తగలించి బడికి పంపుతారు. కానీ 10 ఏళ్ల కొడుకు సాజిద్ స్కూల్కు వెళ్లకపోవడంతో  కన్న తండ్రి అజిత్ మజిద్ ఖాన్ కోపగించుకున్నాడు. ఎందుకు స్కూల్కు వెళ్లడం లేదంటూ ఆ కొడుకుని ప్రశ్నించాడు. అందుకు కొడుకు పెడసరిగా సమాధానం మిచ్చాడు. అంతే తండ్రి కోపం కట్టలు తెంచుకుంది. ఆగ్రహంతో ఉగిపోయాడు. కన్న కొడుకు తలపై పలుమార్లు కర్రతో బలంగా బాదాడు. దాంతో పిల్లోడు ఆపస్మారకస్థితిలోకి వెళ్లాడు.ఆ ఘటన మహారాష్ట్ర థానే జిల్లా అంబర్ నాథ్ టౌన్ షిప్లో ఆదివారం చోటు చేసుకుంది.చుట్టుపక్కలవారు వెంటనే స్పందించి, బాలుడిని సమీపంలోని ఆసుపత్రి తరలించారు. ఆపస్మారక స్థితిలో ఉన్న పిల్లవాడి పరిస్థితి ఆందోళనకరంగా మారటంతో మెరుగైన వైద్య చికిత్స కోసం థానే ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. థానే తరలిస్తున్న తరుణంలో మార్గమథ్యంలోనే బాలుడు మరణించారు. దాంతో అజిత్ మజిద్ ఖాన్పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అయితే నిందితుడు అజిత్ మజిత్ ఖాన్కు ఐదుగురు భార్యలని పోలీసులు తెలిపారు. సాజిద్ తల్లి అజిత్ మజిత్ విడి పోయారని, ఆ నాటి నుంచి సాజిత్ తన తండ్రి వద్దే ఉంటున్నారని పోలీసులు వెల్లడించారు.  

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top