గాంధీ జాతిపిత కాదు.. ఈ దేశం కన్న బిడ్డ : సాధ్వీ ప్రజ్ఞా

భోపాల్ : హిందుత్వ భావజాలంతో ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మరోమారు వార్తల్లో నిలిచారు. భోపాల్ రైల్వే స్టేషన్ వద్ద సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అయితే, బీజేపీ నిర్వహిస్తున్న గాంధీ సంకల్పయాత్రలో మీరెందుకు పాల్గొనడం లేదన్న మీడియా ప్రశ్నకు.. ‘గాంధీ జాతిపిత కాదు. ఈ దేశం కన్న గొప్ప బిడ్డ. ఈ దేశం కోసం కష్టపడ్డారు. అందుకు మేం ప్రశంసిస్తాం. ఆయన అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నిస్తాం. ఇంతకుమించి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు’అని సూటిగా సమాధానమిచ్చారు.
కాగా, ప్రజ్ఞాసింగ్ గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల ప్రచారంలో గాంధీని హత్యచేసిన గాడ్సేను నిజమైన దేశ భక్తుడిగా అభివర్ణించారు. దీంతో ఆగ్రహించిన పార్టీ నాయకత్వం ఆ వ్యాఖ్యలపై వివరణనివ్వాలని ఆదేశించింది. అయితే ఈ వ్యాఖ్యల వల్ల ఆమెకు ఎన్నికల్లో ఎలాంటి ప్రతికూల ప్రభావం ఎదురవలేదు. భోపాల్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై ఆమె భారీ మెజార్టీతో గెలిచారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి