పాకిస్థాన్‌లో బ్యాన్! | Vishal Bhardwaj's Haider may be banned in Pakistan | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్‌లో బ్యాన్!

Oct 5 2014 3:38 AM | Updated on Sep 2 2017 2:20 PM

పాకిస్థాన్‌లో బ్యాన్!

పాకిస్థాన్‌లో బ్యాన్!

విమర్శకుల ప్రశంసలు అందుకొంటున్న ‘హైదర్’ చిత్రానికి పొరుగు దేశం పాకిస్థాన్‌లో తిప్పలు తప్పేట్టు లేవు. అక్కడ విడుదలపై సందేహాలు నెలకొన్నాయి. కారణం...

విమర్శకుల ప్రశంసలు అందుకొంటున్న ‘హైదర్’ చిత్రానికి పొరుగు దేశం పాకిస్థాన్‌లో తిప్పలు తప్పేట్టు లేవు. అక్కడ విడుదలపై సందేహాలు నెలకొన్నాయి. కారణం... ఈ సినిమా కాశ్మీర్ మిలిటెంట్ల నేపథ్యంలో తీసింది కావడం. షాహిద్ కపూర్, శ్రద్ధా కపూర్, టబు, కేకే మీనన్ నటించిన ఈ చిత్రం పాక్ సెన్సార్ బోర్డు నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ పొందడం కష్టమేనని అక్కడి పత్రిక ‘డాన్’ కథనం. ‘పాక్ సెన్సార్ బోర్డు ప్రివ్యూ చూసింది. కొన్ని వివాదాస్పద సన్నివేశాలున్న క్రమంలో విడుదలకు ఓకే చెప్పకూడదని భావిస్తోంది’ అని పత్రిక పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement