మెట్రో ట్రైన్‌లో నాని, రష్మిక

Nagarjuna and Nani MultiStarrer Shot In Hyderabad Metro - Sakshi

హైదరాబాద్ మెట్రో ట్రైన్ ప్రారంభమైన తరువాత మొట్ట మొదటిసారి షూటింగ్ జరుపుకుంటున్న  సినిమా నాగార్జున, నానిల మల్టీ స్టారర్‌.  ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ పతాకంపై మెగా ప్రొడ్యూసర్ సి. అశ్వనిదత్ , శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో నిర్మిస్తున్న  ఈ సినిమా ఉగాది (మార్చి 18) రోజు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. 

ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలను హైదరాబాద్ లో మియాపూర్ స్టేషన్ లో మెట్రో ట్రైన్ లో కొన్ని చిత్రీకరించారు. గతంలో అఖిల్ హీరోగా తెరకెక్కిన హలో సినిమా చిత్రీకరణ మెట్రో ట్రైన్‌లో జరిగినా అప్పటికీ మెట్రో ప్రారంభం కాలేదు.  హైదరాబాద్ మెట్రో ట్రైన్ ప్రారంభమైన తరువాత చిత్రీకరణ జరుపుకున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఈ షెడ్యూల్‌ అందులో నాని, రశ్మిక మందన్న లతో పాటు సంపూర్ణేష్ బాబు పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షూటింగ్ తొలి షెడ్యూల్‌ పూర్తయ్యింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top