హలో... వెనక్కి తిరిగి చూసేది లేదు!

Hello Teaser Release On 16th Nov - Akhil Akkineni, Vikram - Sakshi

ఎంతో దూరంలో లేదు... డిసెంబర్‌ 22వ తేదీ! ఈలోపు ముందుకు దూసుకెళ్లడమే తప్ప... వెనక్కి తిరిగి చూసేది లేదంటున్నారు అఖిల్‌ అక్కినేని. ‘మనం, 24’ సిన్మాల ఫేమ్‌ విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న సినిమా ‘హలో’. అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థలపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 22న విడుదలవుతోంది.

అయితే... అఖిల్‌ ఇప్పట్నుంచి సందడి షురూ చేశారు. మంగళవారం ‘హలో!’ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ రోజు సిన్మా టీజర్‌ను విడుదల చేయనున్నారు. ‘‘ఇదొక యాక్షన్‌ లవ్‌స్టోరీ. టీజర్‌ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు దర్శకుడు విక్రమ్‌. ‘‘మాకింత కంటే ఎక్కువ థ్రిల్‌ ఏమీ లేదు. ఈ నెల 16న (ఈ రోజే) టీజర్‌ మీ (ప్రేక్షకులు) ముందుకు వస్తోంది. ఇక్కణ్ణుంచి వెనక్కి తిరిగి చూసేది లేదు (నో లుక్కింగ్‌ బ్యాక్‌!)’’ అని అఖిల్‌ పేర్కొన్నారు.

నవ్వాం! ఏడ్చాం! ఇప్పుడు...
ఆదివారం నాగచైతన్య–సమంతల రిసెప్షన్‌ జరగడంతో అక్కినేని కుటుంబంలో సందడి నెలకొంది. ఎక్కడ చూసినా... సంతోషమే, నవ్వులే నవ్వులు! అయితే... అనూహ్యంగా సోమవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ‘మనం’ సెట్‌ అగ్ని ప్రమాదానికి గురైంది. మంగళవారం ఉదయం నాగార్జున చేసిన ట్వీట్‌లో ఈ రెంటినీ ఉదహరించినట్టు అర్థమవుతోంది! ‘‘హలో మై ఫ్రెండ్స్‌... ఎమోషనల్‌ వీక్‌ ఇది!! మేము నవ్వాం (రిసెప్షన్‌)! ఏడ్చాం (‘మనం’ సెట్‌ అగ్ని ప్రమాదం)! ఇప్పుడు ‘హలో’ ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేయడానికి రెడీగా ఉన్నాం’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు నాగార్జున.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top