
సాక్షి, ముంబై: రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా డిసౌజాలను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన తొలి సినిమా 'తుఝే మేరి కసమ్' సినిమా వచ్చి అప్పుడే 15 ఏళ్లు అవుతోంది. ఈ సినిమా రితేశ్, జెనీలియాల జీవితాన్ని మార్చివేసింది. ఈ సినిమాలో సహనటులుగా ప్రస్థానాన్ని ప్రారంభించిన వీరిద్దరు ఇప్పుడు భార్యాభర్తలుగా కలిసి జీవితాన్ని సాగిస్తున్నారు. ఇదే విషయాన్ని గుర్తుచేసిన రితేశ్.. ఈ సినిమా సెట్స్‌లో మొదటి రెండురోజులు జెనీలియా తనతో అస్సలు మాట్లాడలేదని తెలిపాడు.
ప్రముఖ తెలుగు దర్శకుడు కే విజయ్‌భాస్కర్ దర్శకత్వంలో రామోజీరావు నిర్మించిన 'తుఝే మేరి కసమ్' సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 'జనవరి 3, 2003న 'తుఝే మేరీ కసమ్' సినిమా విడుదలైంది. నేటికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. మొదటి సినిమాతోనే జీవితం మారిపోయింది. ఆర్కిటెక్ట్ నటుడు అయ్యాడు. సహనటి జెనీలియా జీవితభాగస్వామి అయింది' అని రితేశ్ ట్వీట్ చేశారు. నిర్మాత రామోజీరావు, దర్శకుడు విజయ్‌భాస్కర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
'మా నాన్న అప్పటి ముఖ్యమంత్రి కావడంతో సినిమా షూటింగ్ సమయంలో తొలిరెండురోజులు జెనీలియా మాట్లాడలేదు. ఆమె అడిగిన మొదటి మాట నీ సెక్యూరిటీ ఏదని.. నాకు ఎలాంటి సెక్యూరిటీ లేదని చెప్పాను' అని రితేశ్ గుర్తుచేసుకున్నారు. దివంగత మాజీ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తనయుడైన రితేశ్ తనను ఈ సినిమాకు రికమండ్ చేసినందుకు సినిమాటోగ్రాఫర్ కబీర్‌లాల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Sincere thanks to Director Vijaya Bhaskar Ji - I Love You Sir, Producer Shri Ramoji Rao Sir 🙏🏽 Respect.
— Riteish Deshmukh (@Riteishd) 3 January 2018
Cinematographer Kabir Lal Sir- who recommended me. 🙏🏽.
#15YearsOfTujheMeriKasam pic.twitter.com/npIpCgd6jQ
.@geneliad didn’t speak to me for the first two days during the shoot of the film because my father was the Chief Minister on Maharashtra then. #15YearsOfTujheMeriKasam pic.twitter.com/dezgUiqtpz
— Riteish Deshmukh (@Riteishd) 3 January 2018