అంతా రెడీ..! | Akhil Akkineni's Debut Film: Director Vinayak to Start Shooting from 15 November | Sakshi
Sakshi News home page

అంతా రెడీ..!

Oct 30 2014 11:22 PM | Updated on Jul 15 2019 9:21 PM

అంతా రెడీ..! - Sakshi

అంతా రెడీ..!

ఇప్పటికే ‘మనం’ సినిమాతో జనం ముందుకొచ్చేశారు అఖిల్. ఇక హీరోగా అలరించడమే తరువాయి. అక్కినేని అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న

 ఇప్పటికే ‘మనం’ సినిమాతో జనం ముందుకొచ్చేశారు అఖిల్. ఇక హీరోగా అలరించడమే తరువాయి. అక్కినేని అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ శుభతరుణం కోసం ఇప్పటికే రంగం సిద్ధం చేసేశారట అక్కినేని నాగార్జున. నవంబర్ ద్వితీయార్ధంలో అఖిల్ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరుపనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మాస్‌ను మంత్రముగ్ధులను చేసే చిత్రాలను తెరకెక్కించే వీవీ వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది.

ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయ్యిందని వినికిడి. హీరోయిజాన్ని అత్యంత శక్తిమంతంగా ఆవిష్కరించడంలో వినాయక్ దిట్ట. మరి హీరోగా నటిస్తున్న తొలి సినిమాలో అఖిల్‌ని ఆయన ఏ స్థాయిలో చూపిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నితిన్ తండ్రి - నిర్మాత సుధాకరరెడ్డి నిర్మాణంలో, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రం రూపొం దనుందని సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement