
30 దేశాల్లో 12వేల స్రీన్లపై 'కబాలి' విడుదల
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ఎంత క్రేజ్ ఉంటుందో కొత్తగా చెప్పాల్సినవసరం లేదు.
చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ఎంత క్రేజ్ ఉంటుందో కొత్తగా చెప్పాల్సినవసరం లేదు. సింపుల్ పర్సనాలటీతో తనదైన స్టైల్‌ను హావాభావాలను పలికించగల ఏకైక నటుడు రజనీకాంత్. ఈ పేరులో ఉన్న వైబ్రేషన్ అంతాఇంతా కాదు.. అభిమానుల నుంచి మామూలు సినీ వీక్షకుడిని సైతం థియేటర్ల వైపు పరుగుల పెట్టించగల సత్తా మన సూపర్‌స్టార్‌కే చెల్లుతుంది. రజనీకాంత్ సినిమా నటించిన తాజా చిత్రం 'కబాలి' ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీసు రికార్డులను బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతోంది.
ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులు కోరిక కొద్ది గంటల్లోనే తీరనుంది. ఇప్పటివరకూ ఏ భారతీయ సినిమా విడుదల కానీ రీతిలో రజనీ 'కబాలి' సినిమా విడుదలవుతోంది. దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12 వేల స్రీన్లపై 30 దేశాల్లో ఒకేరోజు విడుదలవుతోంది.
'కబాలీ' సినిమా ఎక్కడెక్కడ విడుదలవుతుంటే...
1. ప్రపంచవ్యాప్తంగా 12 వేల స్రీన్లపై 30 దేశాల్లో ఒకేరోజు విడుదల
2. ఆసియా దేశాల్లో పలు థియేటర్లలో బిగ్ స్రీన్లపై విడుదల
3. చైనాలో 4500 స్రీన్లు, 400 స్రీన్లపై అమెరికాలో, మలేసియా, ఇండోనేషియా, జపాన్ వంటి దేశాల్లో 300 స్రిన్లపై ప్రదర్శింపబడనుంది.
4. ఉత్తర భారతదేశంలో ఏకైక సౌత్ ఇండియన్ సినిమాగా కబాలీ 1000 స్రీన్లపై విడుదల కానుంది.
5. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ ఏ బాలీవుడ్ సినిమా కూడా డబుల్ స్రీన్లపై విడుదల కాలేదు.
6. ఇటీవల ఎయిర్‌ఇండియా విమానాలపై కూడా కబాలీ పోస్టర్లు దర్శనమిచ్చిన విషయం తెలిసిందే.
7. కబాలీ సినిమా ట్రైలర్ వీడియో ఒక వారంలో ఏకంగా 25 మిలియన్లను దాటేసింది
8. చెన్నైలో తొలిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించడం కబాలీ సినిమాతోనే కావడం విశేషం.
9 కబాలీ సినిమా కోసం.. ఇప్పటికే చెన్నైలో కొన్ని ఐటీ కంపెనీలు సహా చిన్న కంపెనీలు కూడా సెలవు ప్రకటించేశాయి.
10. ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శించబడే థియేటర్లలో ఎఫ్‌డీఎస్ లో 6500 స్రీన్లు బుక్ అవ్వగా, ఎఫ్‌డీ 3500 స్రీన్లు బుక్ అయ్యాయి.
11 ప్రపంచంలో ఫ్రాన్స్ అతిపెద్ద థియేటర్ లేగ్రాండ్ రెక్స్‌లో తొలి సౌత్ ఇండియన్ సినిమాగా కబాలీ విడుదల అవుతోంది.
12. విడుదలకు ముందుగానే అమెరికాలో అన్ని షోలు బుకైన ఏకైక సినిమాగా 'కబాలి' రికార్డు.