సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న ఆస్ట్రేలియా చిన్నారి

4 Years Australia Boy Claims Reincarnation of Princess Diana - Sakshi

లండన్‌: ప్రిన్సెస్‌ డయానా.. ఈ కాలం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఓ ఇరవై ఏళ్ల క్రితం ఆమెకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులున్నారు.  మామూలు సాధరణ కుటుంబంలో జన్మించి.. బ్రిటీష్‌ రాజకుంటుంబంలో కోడలిగా అడుగు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఇందరి ప్రేమను పొందిన ఆమె మీద విధికి కన్ను కుట్టింది. దాంతో యాక్సిడెంట్‌ రూపంలో అర్థాంతరంగా డయానాను తనతో తీసుకెళ్లి.. కోట్ల మందిని కన్నీటి సంద్రంలో ముంచింది.

చార్లెస్‌ ప్రిన్సెస్‌ను 1981లో వివాహం చేసుకుని రాజ కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టారు డయానా. తరువాత 1997లో జరిగిన ఓ కారు ప్రమాదంలో ఆమె మరణించారు. డయానా మరణించి నేటికి 20 ఏళ్లకు పైనే అయ్యింది. అయితే తాజాగా ఓ నాలుగేళ్ల ఆస్ట్రేలియా బాలుడు తాను గత జన్మలో ప్రిన్సెస్‌ డయానాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఆ వివరాలు..

ఆస్ట్రేలియాకు చెందిన టీవీ ప్రజెంటర్‌ డేవిడ్‌ క్యాంప్‌ బెల్‌ నాలుగేళ్ల కుమారుడు బిల్లీ క్యాంప్‌ బెల్‌ తానే ప్రిన్సెస్‌ డయానాను అంటున్నాడు. ఇది తనకు పునర్జన్మ అని చెబుతున్నాడు. ప్రిన్స్‌ విలయమ్‌, ప్రిన్స్‌ హ్యారీ తన పిల్లలంటున్నాడు. ఈ విషయం గురించి బిల్లీ తండ్రి డేవిడ్‌ క్యాంప్‌ బెల్‌ మాట్లాడుతూ.. ‘రెండేళ్ల వయసులో బిల్లీ తొలిసారి ఏదో కార్డు మీద డయానా ఫోటోను చూశాడు. అప్పుడే వచ్చిరాని భాషలో ఆ ఫోటోలో ఉన్నది నేనే.. ప్రిన్సెస్‌గా ఉన్నప్పుడు తీసిన ఫోటో అని చెప్పడం ప్రారంభించాడు’ అన్నాడు.

‘చిన్నతనం కదా.. అందుకే అలా మాట్లాడుతున్నాడని భావించాం. కానీ బిల్లీ పెరుగుతున్న కొద్ది.. డయానా జీవితానికి సంబంధించిన విషయాలు.. చార్లెస్‌తో గడిపిన రోజుల గురించి చెప్పేవాడు. కేవలం నాలుగేళ్ల వయసున్న బిల్లీకి.. డయానా గురించి తెలిసే అవకాశం లేదు. అయినా కూడా అతని వ్యాఖ్యలకు మేం పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వలేదు. కానీ కొద్ది రోజుల క్రితం బిల్లీ మరో ఆసక్తికర, నమ్మలేని విషయం గురించి చెప్పాడు. డయానాకు జాన్‌ అనే సోదరుడు ఉన్నాడని.. కానీ పుట్టిన కొద్ది గంటల్లోనే అతను చనిపోయాడని తెలిపాడు. దాంతో నా కుమారుడి మాటలు నమ్మాల్సి వస్తోంది’ అంటున్నాడు డేవిడ్‌.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top