'రిషితేశ్వరి ఆత్మహత్యపై వైఎస్ఆర్ సీపీ రాజకీయం' | N Chinna rajappa takes on YSRCP | Sakshi
Sakshi News home page

'రిషితేశ్వరి ఆత్మహత్యపై వైఎస్ఆర్ సీపీ రాజకీయం'

Aug 6 2015 1:46 PM | Updated on May 29 2018 4:23 PM

'రిషితేశ్వరి ఆత్మహత్యపై వైఎస్ఆర్ సీపీ రాజకీయం' - Sakshi

'రిషితేశ్వరి ఆత్మహత్యపై వైఎస్ఆర్ సీపీ రాజకీయం'

విద్యార్థి రిషితేశ్వరి ఆత్మహత్యపై ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి ఎన్ చినరాజప్ప ఆరోపించారు.

హైదరాబాద్ : విద్యార్థి రిషితేశ్వరి ఆత్మహత్యపై ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి చినరాజప్ప ఆరోపించారు. రిషితేశ్వరి ఆత్మహత్యపై వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ ఆచార్య నాగార్జున యూనివర్శిటీ వెళ్లడంపై చినరాజప్ప గురువారం హైదరాబాద్లో స్పందించారు. 

తమ ప్రభుత్వంలతో మహిళలకు రక్షణ లేదనడం సరికాదన్నారు. నాగార్జున యూనివర్శిటీలోని నాన్ బోర్డర్లను ఇప్పటికే ఖాళీ చేయించామన్నారు. బాలసుబ్రహ్మణ్యం కమిటీ వచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళల రక్షణకు డీఎస్పీ స్థాయి అధికారులను నియమిస్తామని చినరాజప్ప చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement