గ్యాంగ్ రేప్ ఘటనపై హోంమంత్రి సీరియస్ | Home Minister Nayani Narasimha Reddy press meet on Challur gang rape incident | Sakshi
Sakshi News home page

గ్యాంగ్ రేప్ ఘటనపై హోంమంత్రి సీరియస్

Mar 1 2016 5:27 PM | Updated on Sep 3 2017 6:46 PM

చల్లూరు గ్యాంగ్ రేప్ ఘటనపై హోంమంత్రి నాయిని నరసింహా రెడ్డి సీరియస్ అయ్యారు.

హైదరాబాద్ : చల్లూరు గ్యాంగ్ రేప్ ఘటనపై హోంమంత్రి నాయిని నరసింహా రెడ్డి సీరియస్ అయ్యారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. గ్యాంగ్ రేప్ నిందితులను కఠినంగా శిక్షిస్తామని, కేసును వేగంగా దర్యాప్తు చేయాలని ఆదేశాలిచ్చినట్లు స్పష్టం చేశారు. ఈ ఘటనలో సకాలంలో స్పందించని ఎస్సైని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.  

అలాగే జీవనోపాధి నిమిత్తం విదేశాలకు వెళుతున్న కార్మికుల కోసం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ లిమిటెడ్ వెబ్ సైట్ను నాయిని ఆవిష్కరించారు. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడొద్దని ఈ సందర్భంగా మంత్రి కార్మికులకు విజ్ఞప్తి చేశారు. విదేశాలకు వెళ్లాలనుకునేవారు ఆన్ లైన్లో అప్లై చేసుకోవచ్చన్నారు. వచ్చే ఏడాది ఐదు వేల మందిని విదేశాలకు పంపుతామని మంత్రి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement