హిందాల్కో కంపెనీని పునరుద్ధరించాలి | Hindalco company should be renewed | Sakshi
Sakshi News home page

హిందాల్కో కంపెనీని పునరుద్ధరించాలి

Apr 20 2017 1:06 AM | Updated on Jul 29 2019 2:51 PM

హిందాల్కో కంపెనీని పునరుద్ధరించాలి - Sakshi

హిందాల్కో కంపెనీని పునరుద్ధరించాలి

గండిపేట చెరువు సమీ పంలోని హిందాల్కో కంపెనీని పునరుద్ధరించి, అందులోని ఉద్యోగులను ఆదుకోవాలని ప్రభుత్వ

సీఎస్‌కు వినతిపత్రం సమర్పించిన కోదండరాం

సాక్షి, హైదరాబాద్‌: గండిపేట చెరువు సమీ పంలోని హిందాల్కో కంపెనీని పునరుద్ధరించి, అందులోని ఉద్యోగులను ఆదుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు జేఏసీ చైర్మన్‌ కోదండరాం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం సచివాల యంలో సీఎస్‌ను కలసి ఆయన ఆధ్వర్వం లోని బృందం వినతిపత్రం సమర్పించింది. అనంతరం మీడియాతో కోదండరాం మాట్లా డుతూ.. హిందాల్కో కంపెనీ వల్ల ఎటువంటి ఇబ్బం దులు లేవని, ఇది జీవో నెంబర్‌ 111 పరిధిలోకి రాదన్నారు.

ఈ కంపెనీని కొన సాగించడానికి ముందు కొచ్చిన వారికి అవ కాశం ఇవ్వాలని కోరారు. పెద్దపల్లి జిల్లాలోని రామ గుండం గోలివాడ సమీపంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు 400 ఎకరాలను ప్రభుత్వం సేకరించేందుకు యోచిస్తోందన్నారు. అక్కడి నిర్వాసితులు దీనిపై కోర్టు స్టే తెచ్చుకున్నారని, అయినా ప్రభుత్వం బలగా లతో రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జోక్యం చేసు కోవాల ని సీఎస్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. స్కై ఉబర్‌ నిర్మాణం పేరుతో హైదరాబాద్‌లో ప్రధాన ఆకర్షణ కేంద్రంగా ఉన్న శిల్పా రామం కూల్చివేయాలనే ప్రభుత్వ నిర్ణయా న్ని తప్పుబట్టారు. ఎవరి మీద కోపంతోనో.. కక్షతోనో జేఏసీ ఉద్యమాలు చేయడం లేదని కోదండరాం స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement