నెల్లూరు, కాకినాడల మధ్య ఈ నెల 12న వార్ధా తుపాను తీరం దాటనుంది.
12న తీరందాటనున్న వార్ధా తుపాను
Dec 9 2016 4:32 PM | Updated on Oct 20 2018 6:19 PM
అమరావతి: నెల్లూరు, కాకినాడల మధ్య ఈ నెల 12న వార్ధా తుపాను తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం మచిలీపట్నానికి 1090 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉన్న తుపాను సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో తీరం దాటే అవకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది.
10వ తేదీన జాలర్లు సముద్రంలోకి వెళ్లరాదని.. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన జాలర్లు తిరిగి తీరానికి చేరుకోవాలని.. ఎప్పటికప్పుడు సమాచారానికి అనుగుణంగా జాగ్రత్త వహించాలని సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పోర్టు బ్లేయిర్ కు పశ్చిమంగా 250 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని చెప్పింది. తుపాను తీరం దాటే సమయంలో 65-75 కీమీల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
Advertisement
Advertisement