వరదల్లో చిక్కుకున్న 60 మంది కూలీలు | people-stuck-floods in nellore district | Sakshi
Sakshi News home page

వరదల్లో చిక్కుకున్న 60 మంది కూలీలు

Nov 16 2015 1:12 PM | Updated on Oct 20 2018 6:19 PM

నెల్లూరు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కాలంగి నది, పాల కాలువ పొంగిపొర్లుతోంది.

దొరవారిసత్రం: నెల్లూరు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కాలంగి నది, పాల కాలువ పొంగిపొర్లుతోంది. దొరవారిసత్రం మండలం వెదురుపట్టు దగ్గర పొలాల్లో 60 మంది కూలీలు చిక్కుకుపోయారు. కూలీలు పొలాల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరంతా కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన వారిగా గుర్తించారు. కూలీ పనుల నిమిత్తం వారు అక్కడికి వెళ్లినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement