నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి | Man dies as Auto overturns | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Jan 10 2016 12:24 PM | Updated on Oct 20 2018 5:53 PM

చిన్న నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఆటో నడుపుకుంటూ గుట్కా తినడానికి ప్రయత్నించిన యువకుడు ఆటో బోల్తా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

వెల్దుర్తి (గుంటూరు) : చిన్న నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఆటో నడుపుతూ గుట్కా తినడానికి ప్రయత్నించిన యువకుడు ఆటో బోల్తా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మండాది గ్రామ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. మాచర్ల మండలం తేరాలకు చెందిన సాయికృష్ణ(22) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆటోలో స్వగ్రామం నుంచి మాచర్ల వెళ్తుండగా.. మండాది గ్రామ సమీపంలోకి చేరుకోగానే గుట్కా తినడానికి ప్రయత్నించాడు. దీంతో ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆ సమయంలో ఆటోలో ఉన్న ఓ ప్రయాణికుడు ఆటోలో నుంచి దూకి తన ప్రాణాలు రక్షించుకోగా.. సాయికృష్ణ మాత్రం అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రత్యక్ష సాక్షి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement