పవిత్ర దీక్షకు పుణ్యబలం

Ramadan food special - Sakshi

ఉపవాసం ఉన్నప్పుడు ఆత్మికమైన శక్తి జాగృతమవుతుంది. భౌతికమైన శక్తి పునరుజ్జీవం అవుతుంది. ప్రాకృతిక శక్తి తోడు నిలుస్తుంది. దైవిక శక్తి అభయమిస్తుంది. ఉపవాసం అనే ఆరాధానను ముగించి తీసుకునే ఆహారం సత్తువ ఇచ్చేదిలా ఉండటానికి ప్రకృతి అన్ని ఏర్పాట్లు చేసింది. ఇది అలాంటి ఆహారం. పవిత్రమైన ఉపవాసాలు ఆచరించండి. పుణ్యబలం ఇచ్చే ఆహారాన్ని స్వీకరించండి.

ఖర్జూర సేవనం ప్రవక్త సంప్రదాయం
రమజాన్‌ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఖర్జూరం. అందరూ ఇష్టపడే పండు ఖర్జూరం అంటే అతిశయోక్తి కాదు. దైవప్రవక్త ముహమ్మద్‌ (స) ఖర్జూరాలను చాలా ప్రీతిగా ఆరగించేవారు. మనిషి సమస్త అవసరాలు తీర్చే సామర్థ్యం గల పోషకాలు ఖర్జూరంలో ఉన్నాయి. మనిషికి ఇతర ఏ ఆహారం దొరక్కపోయినా ఒక్క ఖర్జూరం మాత్రమే దొరికినా సంపూర్ణ ఆహారం లభించినట్లే. ప్రస్తుత పరిశోధన ల ప్రకారం మానవుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా, సంపూర్ణ శక్తిసామర్థ్యాలు కలవాడుగా ఉండడానికి అతడి ఆహారంలో ఎన్ని క్యాలరీలు అవసరమో అవన్నీ ఖర్జూరంలో ఉన్నాయి. ఈ కారణంగానే ఆ కాలంలో సైన్యాలు ఎడారి ప్రాంతాల్లో చాలాకాలం పాటు బస చేయాల్సి వచ్చినప్పుడు, మరే ఆహారం సమకూరే అవకాశం లేనప్పుడు ఖర్జూరం నిల్వ చేసుకొని నెలల తరబడి ఖర్జూరంతోనే తమ ఆహార అవసరాలు తీర్చుకునేవి. ఖర్జూరం మంచి పోషక విలువలు కలిగిన సంపూర్ణ ఆహారం. అలసటను, నీరసాన్ని దూరం చేసి తక్షణ శక్తినిస్తుంది. ఖర్జూరం ఇంత పౌష్టికాహారం కాబట్టే, ఇందులో ఇన్ని శుభాలు ఉండబట్టే ముహమ్మద్‌ ప్రవక్త (స) శ్రేష్ఠమైన సెహరీ (ఉపవాసం పాటించేవారు తెల్లవారుజామున సేవించే ఆహారం) ఖర్జూరం అని చెప్పారు.

సెహరీలో ఖర్జూరం తినడం వల్ల ఉపవాసకులలో శక్తిసామర్థ్యాలు వృద్ధి చెందుతాయి. తద్వారా పగటివేళ ఇతరత్రా పనులు చేసుకోవడానికి శక్తి లభిస్తుంది. అలాగే ఉపవాస విరమణకు కూడా ఖర్జూరమే శుభప్రదం. ప్రవక్త మహనీయులు ఖర్జూరంతోనే రోజా విరమించమని ఉపదేశించారు. ఖర్జూరంలో శుభం ఉందని సెలవిచ్చారు. ఒకవేళ ఖర్జూరం దొరకని పక్షంలో నీటితోనే ఉపవాసం విరమించాలి. అందుకే రోజువారీ ఆహారంలో ఖర్జూరాలు చేర్చుకోవాలని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుకు కనీసం మూడు ఖర్జూరాలు తిన్నా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే రమజాన్‌ మాసంలో ముస్లింలు దైవప్రవక్త సంప్రదాయాన్ని అనుసరిస్తూ, ఇఫ్తార్‌ (ఉపవాస విరమణ) సమయంలో ఖర్జూరం తీసుకోవడానికి ప్రత్యేక ప్రాముఖ్యతనిస్తారు.

రమజాన్‌ మాసంలో ఇఫ్తార్‌ సమయంలో వీటిని తీసుకుంటారు...
ఖర్జూరం హల్వా
కావలసినవి:ఖర్జూరాలు – అర కేజీపాలు – అర లీటరుపంచదార – అర కిలోబాదం పప్పులు – 30జీడి పప్పులు – 20కిస్‌మిస్‌ – 20ఏలకుల పొడి – 2 టీ స్పూన్లునెయ్యి – 50 గ్రా.
తయారీ: ముందుగా బాదం పప్పు, జీడి పప్పు, కిస్‌మిస్‌లను నేతిలో విడివిడిగా వేయించి పక్కన ఉంచుకోవాలి ఠి గింజలు తీసిన ఖర్జూరాలను పాలలో వేసి స్టౌ మీద ఉంచి, సన్న మంట మీద ఉడికించాలి ఠి ఖర్జూరాలు మెత్తగా అయ్యాక పంచదార, నెయ్యి వేసి మూత పెట్టాలి ఠి మిశ్రమం అడుగంటి పోకుండా గరిటెతో తిప్పుతుండాలి ఠి కొద్దిగా చిక్కబడ్డాక ఏలకుల పొడి వేయాలి ఠి నేతిలో వేయించిన డ్రైఫ్రూట్స్‌ వేసి బాగా కలిపి దించేయాలి ఠి కమ్మటి హల్వా రెడీ అయినట్లే.

దహీ వడ
కావలసినవి:మినప్పప్పు – 150 గ్రా.పెరుగు – 400 గ్రా.ఉప్పు – తగినంతపచ్చి మిర్చి – 3 (చిన్న చిన్న ముక్కలుగా తరగాలి)పోపు కోసంఆవాలు – టీ స్పూనుజీలకర్ర – టీ స్పూను
పచ్చి సెనగ పప్పు – టీ స్పూనుఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి) కరివేపాకు – రెండు రెమ్మలు
తయారీ: ముందురోజు రాత్రి మినప్పప్పు నానబెట్టాలి ఠి మరుసటి రోజు ఉదయం మినప్పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు (నీళ్లు ఎక్కువైతే గారెలు ఎక్కువ నూనె పీల్చుకుంటాయి) జత చేసి గ్రైండ్‌ చేయాలి ఠి పచ్చి మిర్చి, ఉప్పు జత చేసి పక్కన ఉంచాలి ఠి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక గారెలు ఒత్తుకొని నూనెలో వేసి వేయించి తీసేయాలి ఠి ఇలా మొత్తం గారెలు తయారుచేసుకుని పక్కన ఉంచాలి ఠి ఒక గిన్నెలో పెరుగు వేసి కొద్దిగా నీళ్లు జత చేసి చిక్కగా గిలకొట్టి, ఉప్పు జత చే సి పక్కన ఉంచాలి ఠి బాణలిలో నూనె కాగాక పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించి పెరుగులో వేసి కలపాలి ఠి తయారుచేసి ఉంచుకున్న గారెలను పెరుగులో వేసి కొద్దిసేపు నానిన తరవాత కొత్తిమీరతో అలంకరించి అందించాలి.

చన్నా మసాలా
కావలసినవి:సెనగలు – పావు కిలోమిరప కారం – అర టీ స్పూనుఒరుగుల పొడి – అర టీ స్పూనుఅల్లం పొడి – అర టీ స్పూనుజీలకర్ర పొడి – ఒక టీ స్పూనుధనియాల పొడి – ఒక టీ స్పూను
జీలకర్ర పొడి – ఒక టీ స్పూనుఇంగువ – చిటికెడుపచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూనుపుదీనా తరుగు – రెండు టీ స్పూన్లుఉప్పు – అర టీ స్పూనుఉల్లి తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లునూనె – 2 టేబుల్‌ స్పూన్లు నీళ్లు – 200 మి.లీ.
తయారీ: సెనగలను ముందు రోజు రాత్రి నానబెట్టాలి ఠి మరుసటిరోజు సెనగలలో నీళ్లు ఒంపి, శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జతచేసి కుకర్‌లో ఉంచి ఒక విజిల్‌ వచ్చాక మంట తగ్గించి, పది నిముషాల పాటు ఉడికించి దింపేయాలి ఠి విజిల్, కుకర్‌ మూత తీసి, మరోమారు స్టౌ మీద పెద్ద మంట మీద ఉంచి, నీళ్లు ఇగిరేవరకు కలుపుతుండాలి ఠి మరొక పాత్రలో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి, కాగాక ఇంగువ, జీలకర్ర పొడి వేసి కలిపాక, పైన చెప్పిన పొడులన్నీ వేసి కలపాలి ఠి అడుగు అంటకుండా కొద్దిగా నీళ్లు పోసి ఒక నిమిషం పాటు కలపాలి ఠి ఉడికించిన సెనగలను అందులో వేసి, పుదీనా, ఉల్లి తరుగు జత చేసి కలపాలి ఠి అంతే... ఘుమఘుమలాడే చన్నా మసాలా రెడీ ఠి దీనికి నిమ్మరసం కూడా జోడిస్తే మరింత రుచిగా ఉంటుంది. ప్రయత్నించండి.

ఇఫ్తార్‌ కి దాల్‌
కావలసినవి:పచ్చి సెనగ పప్పు – 150 గ్రా.నీళ్లు – 350. మి.లీ.ఉప్పు – సరిపడానిమ్మ రసం – ఒక టీ స్పూన్‌మిరియాల పొడి – కొద్దిగా కొత్తిమీర – కొద్దిగా
తయారీ:  పచ్చి సెనగపప్పుకు తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి ఠి బాగా మెత్తపడ్డాక ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి వేసి కలిపి దింపేయాలి ఠి కొత్తిమీరతో అలంకరించి అందించాలి. 

ఉపవాసాల రోజుల్లో రోజా విరమణ సమయంలో ఈ పదార్థాలను తీసుకుంటారు
మటన్‌ హలీమ్‌
కావలసినవి:కంది పప్పు – అర కప్పుఎర్ర కంది పప్పు (మసూర్‌ దాల్‌) – అర కప్పుపెసర పప్పు – అర కప్పుమినప్పప్పు – అర కప్పుసెనగలు – అర కప్పుటొమాటో తరుగు – ఒక కప్పుగరం మసాలా – ఒక టీ స్పూనుమిరియాల పొడి – ఒక టీ స్పూను ఉల్లి తరుగు – రెండు కప్పులుఉప్పు – తగినంతజీడి పప్పు – 50 గ్రా.పసుపు – ఒక టీ స్పూనుమటన్‌ – అర కేజీమిరప కారం – 4 టీ స్పూన్లు
పెరుగు – ఒక కప్పుకొత్తిమీర తరుగు – అర కప్పుపుదీనా తరుగు – అర కప్పుగోధుమ రవ్వ – పావు కేజీ అల్లం వెల్లుల్లి ముద్ద – సరిపడా
తయారీ:  పైన పేర్కొన్న పప్పులను విడివిడిగా నూనె లేకుండా బాణలిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఠి గోధుమ రవ్వను కూడా దోరగా వేయించి పక్కన  ఉంచాలి ఠి వేయించిన పప్పులను, గోధుమ రవ్వను ఒక పెద్ద పాత్రలో వేసి, రెండు లీటర్ల నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి మూత పెట్టి సుమారు అరగంటసేపు ఉడికించి (మధ్యమధ్యలో కలుపుతుండాలి) పక్కన ఉంచాలి ఠి మరొక కడాయిలో నూనె పోసి స్టౌ మీద ఉంచి వేడయ్యాక, ఉల్లి తరుగు వేసి వేయించాలి ఠి అదే నూనెలో జీడి పప్పు వేసి మరోమారు వేయించి దింపేయాలి ఠి కుకర్‌లో రెండు టీ స్పూన్ల నూనె పోసి స్టౌ మీద ఉంచి వేడయ్యాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మూడు నిమిషాల పాటు బాగా కలపాలి ఠి పసుపు, టొమాటో ముక్కలు వేసి బాగా కలిపి ఉడికించాలి ఠి మటన్, అర టీ స్పూను ఉప్పు, నాలుగు టీ స్పూన్ల మిరప కారం వేసి బాగా కలపాలి ఠి అర కప్పు పెరుగు వేసి కలిపి, రెండు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి ఐదు విజిల్స్‌ వచ్చాక దింపేయాలి ఠి మూత తీసి మరోమారు స్టౌ మీద పెట్టి, నీరు ఇంకిపోయేవరకు కలిపి దించేయాలి ఠి బాగా చల్లారాక పప్పు గుత్తితో మెత్తగా అయ్యేవరకు బాగా మెదపాలి ఠి ఉడికించి ఉంచుకున్న పప్పులను మిక్సీలో వేసి మెత్తగా చేసి, ఒక పెద్ద పాత్రలోకి తీసుకోవాలి ఠి ఉడికించుకున్న మటన్, రెండు కప్పుల నీళ్లు, సగం పుదీనా తరుగు, సగం కొత్తిమీర తరుగు, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, నూనె, నెయ్యి, వేయించి ఉంచుకున్న ఉల్లి తరుగు (ఒక కప్పు) జత చేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి, సన్నని మంట మీద సుమారు 20 నిమిషాలు ఉడికించాలి ఠి అడుగు అంటకుండా మధ్యమధ్యలో కలిపి దించేయాలి ఠి జీడి పప్పు, నెయ్యి, ఒక కప్పు ఉల్లి తరుగు, పుదీనా, కొత్తిమీరలతో అలంకరించి మటన్‌ హలీం అందించాలి.

మటన్‌ మందీ
కావలసినవి: మటన్‌ – 750 గ్రా.బాస్మతి బియ్యం – 500 గ్రా.జీడి పప్పు – 50 గ్రా.బాదం పప్పులు – 50 గ్రా.నెయ్యి – 4 టేబుల్‌ స్పూన్లునూనె – తగినంతపచ్చి మిర్చి తరుగు – రెండు టీ స్పూన్లు
పసుపు – అర టీ స్పూనుమిరప కారం – ఒక టీ స్పూనుఉప్పు – తగినంతశొంఠి పొడి – ఒక టీ స్పూనులవంగాలు – 2దాల్చిన చెక్క – మూడు చిన్న ముక్కలుకొత్తిమీర, పుదీనా – తగినంతఎండు నిమ్మ చెక్కలు – 2మందీ స్పైస్‌ కోసంధనియాలు – ఒక టేబుల్‌ స్పూనుజీలకర్ర – ఒక టేబుల్‌ స్పూనులవంగాలు – 4దాల్చిన చెక్క – చిన్న ముక్కఏలకులు – 4మిరియాలు – అర టేబుల్‌ స్పూనుజాజికాయ – చిన్న ముక్కశొంఠి – కొద్దిగా బిరియానీ ఆకు – 2 (ఈ పదార్థాలన్నీటినీ పొడి చేసి ఉంచుకోవాలి)

తయారీ: మటన్‌ను శుభ్రంగా కడిగి తడి లేకుండా నీళ్లు శుభ్రంగా తీసేయాలి ఠి మటన్‌లో ఒక టేబుల్‌ స్పూను మందీ స్పైస్, ఒకటిన్నర టీ స్పూన్ల ఉప్పు, అర టీ స్పూను పసుపు... వీటిని మటన్‌కు పట్టించి, మూడు గంటలపాటు పక్కన ఉంచాలి ఠి మూడు గంటల తరవాత ఒక పాత్రలో రెండు టేబుల్‌ స్పూన్ల నెయ్యి, ఒక టేబుల్‌ స్పూన్‌ నూనె, ఉల్లి తరుగు, దాల్చిన చెక్క ముక్కలు, రెండు లవంగాలు వేసి నిమిషం పాటు వేయించాలి ఠి మసాలా పట్టించిన మటన్‌ ముక్కలు వేసి మరో నిమిషం పాటు కలియతిప్పాలి ఠి ఒకటిన్నర టీ స్పూన్ల మిరప కారం, ఒక టీ స్పూను శొంఠి పొడి వేసి బాగా కలిపి, లీటరున్నర నీళ్లు, అర టేబుల్‌ స్పూను మందీ స్పైస్, రెండున్నర టీ స్పూన్ల ఉప్పు, పచ్చి మిర్చి తరుగు వేసి బాగా కలపాలి ఠి ఎండు నిమ్మ చెక్కలు వేసి మూత పెట్టి సన్నని మంట మీద ఉడకనివ్వాలి ఠి కొద్దిగా పొంగు వచ్చిన తరవాత మూత తీసి, మటన్‌ ముక్కలు మెత్తగా అయ్యేవరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి ఠి మటన్‌ ముక్కలు మెత్తగా అయిన తరవాత, ముక్కలు తీసేయాలి ఠి అరగంట నానబెట్టిన బాస్మతి బియ్యం మరుగుతున్న నీటిలో వేసి, సన్నటి మంట మీద ఉడికించి దింపేయాలి ఠి ఉడికిన అన్నం మీద మటన్‌ ముక్కలు పరిచి, మధ్యలో స్టీలు గిన్నె పెట్టి, అందులో కాలుతున్న బొగ్గు ముక్క ఉంచి, దాని మీద ఒక టీ స్పూను నెయ్యి పోయాలి ఠి పొగరావడం మొదలైన వెంటనే మూత పెట్టి ఐదు నిమిషాల తరవాత మూత తీసేసి, స్టీలు గిన్నె కూడా తీసేయాలి ఠి మటన్‌ మందీ రెడీ అయినట్లే ఠి ప్లేటులో వడ్డించి, వేయించి ఉంచిన బాదం పప్పులు, జీడి పప్పులతో పాటు, కొత్తిమీర, పుదీనాలతో అలంకరించి అందించాలి. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top