వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు.
తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వైఎస్ జగన్ మోహన్రెడ్డి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు బయలుదేరారు. సూళ్లూరుపేటకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దబ్బళ రాజారెడ్డి అంత్యక్రియల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు.
దబ్బళ రాజారెడ్డి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడేవారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.