'ఎమ్మెల్యే డ్రైవర్‌ మృతిపై అనుమానాలున్నాయి' | we have doubts on suicide of MLA driver akbhar | Sakshi
Sakshi News home page

'ఎమ్మెల్యే డ్రైవర్‌ మృతిపై అనుమానాలున్నాయి'

Feb 16 2016 5:17 PM | Updated on Sep 3 2017 5:46 PM

హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి డ్రైవర్ అక్బర్‌ మృతిపై అనుమానాలున్నాయని పిన్ని రషీదా చెప్పారు.

హైదరాబాద్‌: హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి డ్రైవర్ అక్బర్‌ మృతిపై అనుమానాలున్నాయని అతడి పిన్ని రషీదా ఆరోపించారు. వారం రోజులుగా అక్బర్‌ మౌనంగా ఉంటున్నాడనీ, కొత్త డ్రైవర్‌తో ఏదో ఒకటి తేల్చుకుంటానని అతడు ఉదయం అన్నట్టుగా రషీదా చెప్పింది.

అయితే మధ్యాహ్నానికల్లా అక్బర్‌ చనిపోయాడని తనకు తెలిసిందని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి డ్రైవర్ అక్బర్‌ మంగళవారం మధ్యాహ్నం గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement