మండలంలోని బాచుపల్లి గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం వేకువజామున ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు, లారీ ఢీ కొన్న ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి.
గుత్తి రూరల్ (గుంతకల్లు) : మండలంలోని బాచుపల్లి గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం వేకువజామున ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు, లారీ ఢీ కొన్న ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు హైదరాబాదు నుంచి బెంగళూరు వైపునకు వెళుతోంది.
అలాగే బాచుపల్లి గ్రామ శివారులో లారీ గుత్తి క్రాస్ వద్ద తిప్పడంతో వెనుక వేగంగా వస్తున్న ఓల్వో బస్సు అదుపు తప్పి ఎదురుగా ఉన్న లారీని ఢీ కొంది. ఈ ప్రమాదంలో మెదక్‌కు చెందిన కాశీరాం, నెల్లూరుకు చెందిన శరత్ చంద్ర, హైదరాబాదు కాచిగూడకు చెందిన స్వప్న, హేమ గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం గుత్తి ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్సల కోసం అనంతపురానికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.