నేరేడుచర్ల మండలం మేడారం వద్ద నాగార్జున్‌సాగర్ ఎడమకాల్వలో బుధవారం గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొచ్చింది.
నేరేడుచర్ల
నేరేడుచర్ల మండలం మేడారం వద్ద నాగార్జున్‌సాగర్ ఎడమకాల్వలో బుధవారం గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. వివరాలు.. మేడారం వద్ద నాగార్జునసాగర్ ఎడమకాల్వలో గుర్తుతెలియని శవం కొట్టుకు వస్తుండడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ జి.గోపి సిబ్బందితో కాల్వ వద్దకు వెళ్లి నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని బయటకు తీసి మిర్యాలగూడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియరాలేదని, శరీరంపై ఉన్న చొక్కాపై మెగా టైలర్స్, ఎస్పీటీ మార్కెట్ నల్లగొండ అని స్టిక్కర్ ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గోపి తెలిపారు.