ఉత్తమ ఉద్యోగులు వీరే.. | These are the best employees .. | Sakshi
Sakshi News home page

ఉత్తమ ఉద్యోగులు వీరే..

Aug 15 2017 1:06 AM | Updated on Sep 12 2017 12:04 AM

జిల్లా ఉత్తమ ఉద్యోగులు ఖరారయ్యారు. జిల్లా మైనార్టీ శాఖను విస్మరించిన అధికారులు ...

158 మందిని ఎంపిక చేసిన జిల్లా అధికారులు
మైనారిటీ శాఖకు మొండిచెయ్యి
పోలీసుశాఖకు అత్యధికంగా 41 అవార్డులు
ఖరారుకాని స్వచ్ఛంద సంస్థలు, కళాకారుల జాబితా


సాక్షి, జగిత్యాల : జిల్లా ఉత్తమ ఉద్యోగులు ఖరారయ్యారు. జిల్లా మైనార్టీ శాఖను విస్మరించిన అధికారులు వివిధ శాఖల్లో పని చేస్తున్న 158 మంది ఉద్యోగులతో తుది జాబితా ఖరారు చేశారు.  జిల్లా కేంద్రంలోని ఖిలాలో మంగళవారం నిర్వహించే స్వాతంత్య్ర వేడుకల్లో ప్రభుత్వ చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌ వీరికి పురస్కారాలు, ప్రశంసాపత్రాలు ప్రదానం చేస్తారు. పోలీస్‌ శాఖ నుంచి అత్యధికంగా 41 మంది నిపురస్కారాలు వరించాయి. మెట్‌పల్లి సబ్‌ కలెక్టర్‌ ముషర్రఫ్‌అలీ, జిల్లా రెవెన్యూ అధికారి టి.శ్యాంప్రకాశ్, డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అశోక్‌రాజు, ఇరిగేషన్‌ అధికారి నారాయణరెడ్డి, బీసీ వెల్ఫేర్‌ అధికారి ఎం.రాజేందర్, పంచాయతీరాజ్‌ ఈఈ మనోహర్‌రెడ్డి, కోఆపరేటివ్‌ అధికారి ఎస్‌.రామానుజచారి, జిల్లా వైద్యాధికారి సుగంధిని, జిల్లా పౌరసంబంధాల అధికారి ముహ్మద్‌ గౌస్, కోరుట్ల మున్సిపల్‌ కమిషనర్‌ వాణిరెడ్డి జిల్లా అధికారుల కోవలో ఎంపికయ్యారు.

జిల్లా రెవెన్యూ శాఖ నుంచి 25 మంది, డీఆర్డీవో కార్యాలయం నుంచి పది మంది, పంచాయతీరాజ్‌ నుంచి ఎనిమిది మంది ఎంపికయ్యారు. పశుసంవర్ధకశాఖ, వైద్యారోగ్యం, ఎక్సైజ్, విద్యాశాఖల నుంచి ఐదుగురు, కలెక్టరేట్, రెసిడెన్షియల్‌ స్కూళ్లు, రవాణా, జిల్లా కోఆపరేటివ్,  ధాన్యం కొనుగోలు, సేకరణ గ్రూపులకు మూడు చొప్పున అవార్డులు వరించాయి. కలెక్టరేట్, ఇంటెలిజెన్స్, ఆర్టీసీ, బీసీ వెల్ఫేర్, ఈఈ పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్, ఐసీడీఎస్‌ శాఖల నుంచి రెండు చొప్పున.. మిషన్‌ భగీరథ, ఆర్‌అండ్‌బీ, అగ్రికల్చర్, జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, హౌసింగ్, సీఐడీ రీజినల్, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డు శాఖల నుంచి ఒక్కొక్కరిని అవార్డులకు ఎంపిక చేశారు. స్వచ్చంద సంస్థల నిర్వాహకులు, కళాకారుల జాబితా సోమవారం రాత్రి 10:30 గంటల వరకు ప్రకటించలేదు. ఎన్‌జీవోలు, కళాకారులు తమకు పురస్కారాలు వస్తాయో రావోననే ఉత్కంఠ నెలకొంది. గణతంత్ర దినోత్సవం.. రాష్ట్రావతరణ వేడుకల్లోనూ జి ల్లా మైనార్టీ శాఖ కార్యాలయ ఉద్యోగులను వి స్మరించిన అధికారులు.. స్వాతంత్ర దినో త్స వ వేడుకల్లోనూ అదే తీరుగా వ్యవహరించడంతో మైనార్టీల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement