ప్రజా సమస్యల పరిష్కారంకోసం కృషి | solved the public problems | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యల పరిష్కారంకోసం కృషి

Jul 19 2016 11:38 PM | Updated on Sep 4 2017 5:19 AM

ప్రజా సమస్యల పరిష్కారంకోసం కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. కిష్టంపేట గ్రామంలో మంగళవారం ట్రాన్స్‌ఫార్మర్, దోభీఘాట్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలోని సమస్యల పరిష్కారమే ధ్యేయమన్నారు.

  • ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
  • రాయికల్‌ : ప్రజా సమస్యల పరిష్కారంకోసం కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. కిష్టంపేట గ్రామంలో మంగళవారం ట్రాన్స్‌ఫార్మర్, దోభీఘాట్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలోని సమస్యల పరిష్కారమే ధ్యేయమన్నారు. గ్రామాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజాప్రతినిధులు గుర్తించి తన దృష్టికి తీసుకురావాలని, తద్వారా సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఉంటేనే మండలం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గోపి మాధవి, సర్పంచ్‌ తంగెళ్ల రమేశ్, ఎంపీటీసీ శంకరయ్య, ఉపసర్పంచ్‌ సురేశ్‌గౌడ్, నాయకులు జాన గోపి, యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    ఉపాధి రోజులు పెంచాలని కలెక్టర్‌కు వినతి
    జగిత్యాల రూరల్‌ : ఉపాధి పథకంలో కూలీలకు 100 రోజుల నుంచి 150 రోజుల పని దినాలు పెంచాలని మంగళవారం కలెక్టర్‌ నీతుకుమారి ప్రసాద్‌కు టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ వినతిపత్రం సమర్పించారు. మంగళవారం వెల్దుర్తిలో హరితహారానికి హాజరైన కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. గ్రామీణ ప్రాంతాల్లోని గీత కార్మికులకు ఉపాధి పథకంలో ఈత, తాటిచెట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నక్కల రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీ బిరుదుల గంగమ్మ, నాయకులు ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement