14న మేడాపురానికి శివశంకర్‌ మాస్టర్‌ రాక | sivashankar master comes medapuram | Sakshi
Sakshi News home page

14న మేడాపురానికి శివశంకర్‌ మాస్టర్‌ రాక

Jan 12 2017 11:32 PM | Updated on Sep 5 2017 1:06 AM

ఈ నెల 14న చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురం గ్రామానికి ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌ రానున్నారు.

చెన్నేకొత్తపల్లి (రాప్తాడు) : ఈ నెల 14న చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురం గ్రామానికి ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌ రానున్నారు. ఈ మేరకు మండల వైఎస్‌ఆర్‌ సీపీ కన్వీనర్‌ మెట్టు గోవిందరెడ్డి, ఎస్సీ సెల్‌ నేత సాలమ్మగారి సాయికృష్ణ తెలిపారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాప్తాడు నియోజకవర్గ సమన్వకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి నేతృత్వంలో 14న తలపెట్టిన గడపగడపకూ వైఎస్‌ఆర్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారని పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement