మహిళపై అత్యాచారయత్నం | rape attempt on tribal woman | Sakshi
Sakshi News home page

మహిళపై అత్యాచారయత్నం

Dec 19 2016 9:06 PM | Updated on Jun 4 2019 5:16 PM

పొలం వద్ద ఒంటరిగా ఉన్న గిరిజన మహిళపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.

ఎల్‌ తాండ (వెల్దుర్తి రూరల్‌): పొలం వద్ద ఒంటరిగా ఉన్న గిరిజన మహిళపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎల్‌ తండాలో సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలి వివరాల మేరకు.. పొలం వద్ద పనులు చేసుకుంటున్న మహిళపై పశులు మేపేందుకు వెళ్లిన ఎల్‌నగరం గ్రామానికి చెందిన హరిజన జమ్ములు అత్యాచారం చేయబోయాడు. ఆమె ప్రతిఘటించగా గొడ్డలితో దాడి చేశాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన నిందితుడి తమ్ముడు కిట్టు కూడా అతని సహకరించాడు. వారి నుంచి తప్పించుకుని గ్రామానికి చేరుకున్న మహిళ తన తమ్ముడి సహాయంతో వెల్దుర్తి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. మహిళ కాలికి తీవ్రం కాగా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేసి కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ తులసీ నాగప్రసాద్‌ తెలిపారు.   

Advertisement
 
Advertisement
Advertisement