ప్రజారోగ్య సాంకేతిక శాఖలో భారీ మార్పులు | public health and technical department will see huge changes | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్య సాంకేతిక శాఖలో భారీ మార్పులు

Sep 4 2016 12:26 AM | Updated on Oct 16 2018 6:47 PM

జిల్లాల పునర్విభజనతో పబ్లిక్‌ హెల్త్‌ మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ శాఖలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. నూ తనంగా ఏర్పడే జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో, పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న ఇంజనీర్ల కేటాయింపు కసరత్తు ఇప్పటికే పూర్తయ్యింది. ఈ మేరకు వరంగల్‌ రీజినల్‌ పబ్లిక్‌ హెల్త్‌ ము న్సిపల్‌ ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈ రాజేశ్వర్‌రావు ప్రతిపాదనలు రాష్ట్ర ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ ధన్‌సింగ్‌కు నివేదించారు.

వరంగల్‌ అర్బన్‌ : జిల్లాల పునర్విభజనతో పబ్లిక్‌ హెల్త్‌ మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ శాఖలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. నూ తనంగా ఏర్పడే జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో, పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న ఇంజనీర్ల కేటాయింపు కసరత్తు ఇప్పటికే పూర్తయ్యింది. ఈ మేరకు వరంగల్‌ రీజినల్‌ పబ్లిక్‌ హెల్త్‌ ము న్సిపల్‌ ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈ రాజేశ్వర్‌రావు ప్రతిపాదనలు రాష్ట్ర ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ ధన్‌సింగ్‌కు నివేదించారు. పబ్లిక్‌ హెల్త్‌ మునిసిపల్‌ ఇంజినీరింగ్‌ శాఖ వరంగల్‌ రీజియన్‌ పరిధిలో వరంగ ల్, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల కేంద్రాల్లో కార్యాలయాలు ఉన్నాయి. ఈ నాలుగు జిల్లాల పరిధి లో ఒక గ్రేటర్‌ కార్పొరేషన్, రెండు మునిసిపల్‌ కార్పొరేషన్లు, 31 మునిసిపాలిటీలు, నగర పం చాయతీలు ఉన్నాయి. పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీర్లు మునిసిపాలిటీల్లో, మునిసిపల్‌ ఇంజినీర్లు నగర పంచాయతీల్లోని తాగునీటి శుద్ధి, సరఫరా, రోడ్లు, డ్రెయినేజీలు, ఇతర అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తుంటారు. అంతేకాకుండా ముసాయిదాలోని 12 జిల్లాల పరిధిలో గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్, కరీంనగర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్, రామగుండం మునిసిపల్‌ కార్పొరేషన్లలో తాగునీరు, ఫిల్టర్‌బెడ్ల నిర్మాణం లాంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపట్టనున్న పనులను పబ్లిక్‌ హెల్త్‌ మున్సిపల్‌ ఇంజనీర్లు పర్యవేక్షిస్తుంటారు. ఇదిలా ఉండగా మున్సిపల్‌ ఇంజినీర్లకు కార్పొరేషన్ల నుంచి మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు బదిలీ లు ఉంటాయి. తాజాగా జిల్లాల పునర్విభజనతో నాలుగు జిల్లాలు పరిధిలో ఖమ్మం, కొత్తగూడెం, మానుకోట, జయశంకర్‌(భూపాలప ల్లి), వరంగల్, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, కొమురంభీం జిల్లా, ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాలుగా విస్తరించనున్నారు.
 
రీజినల్‌ కార్యాలయంపై స్పష్టత కరువు
 
వరంగల్‌ కేంద్రంగా ఉన్న రీజినల్‌ కార్యాలయంపై కొత్త జిల్లా ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యాక భవితవ్యం తేలుతుందని ఇంజినీరింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు. ఆరు జిల్లాలకు కలిసి ఒక రీజినల్‌ కార్యాలయాలు ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదనే వాదనలు వినవస్తున్నాయి. లేనియెడల ఆర్‌డీ కార్యాలయాన్ని ఎత్తివేసి, హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉంది. నాలుగైదు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement