అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి | man suspicious death in kariganipalli | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

Feb 11 2017 10:54 PM | Updated on Sep 5 2017 3:28 AM

మండలంలోని కరిగానిపల్లి గ్రామానికి చెందిన రుద్రన్న(33)అనే వ్యక్తి శనివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

కుందుర్పి : మండలంలోని కరిగానిపల్లి గ్రామానికి చెందిన రుద్రన్న(33)అనే వ్యక్తి శనివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. అతడికి పదేళ్ల క్రితం అప్పిలేపల్లికి చెందిన అనితతో వివాహమైంది. శుక్రవారం అర్ధరాత్రి అప్పిలేపల్లిలో జరిగిన ఆంజనేయస్వామి రథోత్సవం చూసి తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో మోటర్‌బైక్‌పై కరిగానిపల్లికి బయలు దేరాడు.

మార్గమధ్యంలో చిన్నపాటి దెబ్బలతో సృహ కోల్పోయి ఉండడాన్ని గమనించిన వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో అతడు మృతి చెందాడు. అతడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుడి అన్న తిప్పేస్వామి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement