నాయుడుపేట టౌన్: పట్టణ పరిధిలోని శ్రీ కాళహస్తి బైపాస్‌రోడ్డుపై ఆదివారం సాయంత్రం ఇనుప పైపుల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది.
లారీ బోల్తా: ఇద్దరికి గాయాలు
Jul 17 2016 10:39 PM | Updated on Aug 25 2018 5:39 PM
	నాయుడుపేట టౌన్: పట్టణ పరిధిలోని శ్రీ కాళహస్తి బైపాస్‌రోడ్డుపై ఆదివారం సాయంత్రం ఇనుప పైపుల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ రాజు, క్లీనర్ ఖాదర్‌బాషా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు..వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నుంచి భారీ ఇనుప పైపుల లోడుతో లారీ కష్ణపట్నం పోర్టుకు బయలుదేరింది. మార్గమధ్యలో నాయుడుపేట వద్ద అవని అపార్ట్‌మెంట్ సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో లారీ బోల్తా పడింది. గాయపడిన రాజు, ఖాదర్‌బాషాకు మొదట స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేసి తర్వాత మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. మరోవైపు ఇనుప పైపులు తగిలి ఓ విద్యుత్ స్తంభం ఒరిగిపోయింది. కాసేపు ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
