ఫ్లెడ్‌లైట్ల వెలుగులో కోడి పందాలు | kodipandalu ..17th members arrested | Sakshi
Sakshi News home page

ఫ్లెడ్‌లైట్ల వెలుగులో కోడి పందాలు

Jan 8 2017 11:18 PM | Updated on Sep 5 2017 12:45 AM

కోర్టులు ఆదేశించినా, పోలీసులు చర్యలు చేపట్టినా సంక్రాంతి ప్రత్యేక సంబరం కోడి పందేలు నిరాటంకంగా సాగుతున్నాయి. జిల్లాలోని మెట్ట ప్రాంతమైన రాజానగరం మండలం, దివా¯ŒSచెరువు శివారు శ్రీరామపురంలో కోడి పందాలు జరుగుతున్నాయనే సమాచారంతో

  • ఆకస్మాత్తు దాడుల్లో పట్టుబడిన 17 మంది పందెగాళ్లు 
  • సమాచారమిస్తే జూదాలను అడ్డుకుంటామన్న పోలీసులు
  • రాజానగరం : 
    కోర్టులు ఆదేశించినా, పోలీసులు చర్యలు చేపట్టినా సంక్రాంతి  ప్రత్యేక సంబరం కోడి పందేలు నిరాటంకంగా సాగుతున్నాయి. జిల్లాలోని మెట్ట ప్రాంతమైన రాజానగరం మండలం, దివా¯ŒSచెరువు శివారు శ్రీరామపురంలో కోడి పందాలు జరుగుతున్నాయనే సమాచారంతో పోలీసులు ఆకస్మికదాడులు చేశారు. రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా ఎస్పీ రాజకుమారి ఆదేశాలతో రంగంలోకి దిగిన  స్పెషల్‌ బ్రాంచ్, ఏజీఎస్‌ పార్టీలు స్థానిక పోలీసులతో కలిసి శనివారం అర్థరాత్రి నిర్వహించిన ఈ దాడులకు సంబంధించిన వివరాలను రాజమహేంద్రవరం స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ పి.నారాయణరావు ఆదివారం ఇక్కడ విలేకరులకు వివరించారు. 
    17 మంది అరెస్టు..
    కోర్టు తీర్పును అతిక్రమిస్తూ, జీవహింసను ప్రేరేపించేలా శ్రీరామపురంలోని సంగిశెట్టి బుజ్జికి చెందిన తోటలో కోడి పందేలు ఆడుతున్న 17 మందిని అరెస్టు చేశామన్నారు. వారి నుంచి ఏడు కోడిపుంజులు, 22 కోడి కత్తులు, 14 సెల్‌ఫోన్లు, రూ. 84,150 లు నగదు, ఏడు మోటారు సైకిళ్లు స్వాధీనపర్చుకున్నామన్నారు. దొరికిన ఏడు కోళ్ల కాళ్లకు కత్తులు కట్టిఉన్నాయన్నారు. అరెస్టయిన కొత్తపల్లి సుజనారావు, పామర్తి రాంబాబు, అంకం వీరబాబు, రాగల ప్రసాద్, రౌతుల వెంకటేష్, ఒగ్గేస లోవరాజు, ఉర్రింకల కృష్ణ, కస్తూరి మణికంఠ, అడపా ప్రకాష్, సంగుల సత్తిబాబు, మారిశెట్టి వెంకటేశ్వర్రావు, వల్లూరి పోతురాజు, ఎం. లోవరాజు, సంగిశెట్టి బుజ్జి, సీహెచ్‌. శ్రీనివాస్, అసర నానిరత్నం, నల్లమోలు దుర్గారావు శ్రీరామపురం, దివా¯ŒSచెరువు, పిండింగొయ్యిలకు చెందిన వారన్నారు.   ఏపీజీ యాక్ట్‌ సెక్ష¯ŒS11, ప్రివెన్షన్‌ ఆఫ్‌ యానిమల్‌ క్రూయాల్టీ యాక్ట్‌ 1960 ప్రకారం అరెస్టు చేసిన వీరిని కోర్టుకు హాజరుపరుస్తున్నామన్నారు. వీరిపై హిస్టరీ షీట్‌ ఓపె¯ŒS చేస్తామన్నారు. కాగా వీరి పందాల వల్ల గాయాలై రక్తం కారుతున్న కోళ్లకు పశువైద్యశాలకు తీసుకువెళ్లి చికిత్స చేయిస్తామన్నారు.
     
    సమాచారమిస్తే గోప్యంగా ఉంచుతాం
    సంక్రాంతి సంబరాలలో కోడి పందాలను  నిర్మూలించడంలో ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని డీఎస్పీ నారాయణరావు విజ్ఞప్తి చేశారు. బెట్టింగ్‌తో కోడి పందాలు ఆడుతుంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. వీటితోపాటు పేకాట, గుండాట వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా తెలియజేయవచ్చన్నారు. రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా ఎస్పీ ఫో¯ŒS నంబరు 9440796502, స్పెషల్‌ బ్రాంచ్‌ ఫో¯ŒS నంబర్లు 0883–2427166,  0883–2427155లకు తెలియజేయవచ్చన్నారు.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement