కీమెన్‌ సమయస్ఫూర్తి | Keeman Alert | Sakshi
Sakshi News home page

కీమెన్‌ సమయస్ఫూర్తి

Aug 17 2016 2:00 AM | Updated on Sep 4 2017 9:31 AM

బాలానగర్‌ రైల్వే స్టేషన్‌లో నిలిచిన నిజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌

బాలానగర్‌ రైల్వే స్టేషన్‌లో నిలిచిన నిజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌

బాలానగర్‌ : రైల్వే కీమెన్‌ సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పిన ఘటన బాలానగర్‌ మండలం పెద్దాయపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. వివరాలిలాఉన్నాయి. మం గళవారం ఉద యం లక్నో ఎక్‌్సప్రెస్‌ రైలు మహబూబ్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా పెద్దాయపల్లిగ్రామ శివారు హరిఓం పరిశ్రమ సమీపంలో పట్టా విరిగిన విషయాన్ని కీమెన్‌ అబ్బులు గమనించాడు. వెంటనే చేతిలోని ఎర్రజెండాను ఊపుతూ డ్రైవర్‌కు సిగ్నల్‌ ఇచ్చాడు. రైలు ఆగి

బాలానగర్‌ : రైల్వే కీమెన్‌ సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పిన ఘటన బాలానగర్‌ మండలం పెద్దాయపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. వివరాలిలాఉన్నాయి.   మం గళవారం ఉద యం లక్నో ఎక్‌్సప్రెస్‌ రైలు మహబూబ్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా పెద్దాయపల్లిగ్రామ శివారు హరిఓం పరిశ్రమ సమీపంలో పట్టా విరిగిన విషయాన్ని కీమెన్‌ అబ్బులు గమనించాడు. వెంటనే  చేతిలోని ఎర్రజెండాను ఊపుతూ డ్రైవర్‌కు సిగ్నల్‌ ఇచ్చాడు.  రైలు ఆగిపోయింది. తాత్కాలికంగా మరమ్మతు చేసి లక్నో ఎక్‌్సప్రెస్‌ను బాలానగర్‌ స్టేష¯Œæకు తీసుకెళ్లారు. అనంతరం వచ్చిన నిజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌ను కూడా నిలిపివేశారు. రైల్వే అధికారులు, సిబ్బంది తెగిన పట్టాకు మరమ్మతులు చేసిన అనంతరం రెండురైళ్లను  పంపారు. దీంతో అరగంట ఆలస్యంగా రైళ్లు వెళ్లాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement