ముగిసిన కంగాల్‌షా వలీ ఉరుసు | kangalshah urusu ends | Sakshi
Sakshi News home page

ముగిసిన కంగాల్‌షా వలీ ఉరుసు

Mar 2 2017 11:56 PM | Updated on Sep 5 2017 5:01 AM

ముగిసిన కంగాల్‌షా వలీ ఉరుసు

ముగిసిన కంగాల్‌షా వలీ ఉరుసు

మండల పరిధిలోని తుంగభద్ర నదీ సమీపంలోని బావాపురంలో వెలసిన కంగాల్‌షా వలీకంగాల్‌షా వలీ ఉరుసు గురువారంతో ముగిసింది.

– మూడు రాష్ట్రాల భక్తులతో కిటకిటలాడిన బావాపురం
బావాపురం (కర్నూలు సీక్యాంప్‌): మండల పరిధిలోని తుంగభద్ర నదీ సమీపంలోని బావాపురంలో వెలసిన కంగాల్‌షా వలీకంగాల్‌షా వలీ ఉరుసు గురువారంతో ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన ఉరుసు ఉత్సవాలకు కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. చివరిరోజు అయిన గురువారం కిస్తీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా కర్ణాటక భక్తులు ప్రసాదం వేసిన తర్వాత స్థానిక భక్తులు ప్రసాదం వేశారు. ఈ ప్రసాదాన్ని తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. ప్రసాదం దక్కితే మంచిదని భక్తుల నమ్మకం.
 

Advertisement
 
Advertisement
Advertisement