'లాకప్ డెత్ విషయమా.. నాకు తెలీదే' | dgp ramudu comments on lockup death | Sakshi
Sakshi News home page

'లాకప్ డెత్ విషయమా.. నాకు తెలీదే'

Sep 12 2015 3:29 PM | Updated on Sep 3 2017 9:16 AM

'లాకప్ డెత్ విషయమా.. నాకు తెలీదే'

'లాకప్ డెత్ విషయమా.. నాకు తెలీదే'

అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లిలో బత్తెన శ్రీరాములు (54) పోలీసుల అదుపులో శుక్రవారం చనిపోయిన సంగతి తెలిసిందే.

అనంతపురం: అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లిలో బత్తెన శ్రీరాములు (54) పోలీసుల అదుపులో శుక్రవారం చనిపోయిన సంగతి తెలిసిందే. మండలంలోని ముష్టికోవెల పంచాయతీ గువ్వలగొందిపల్లెకు చెందిన శ్రీరాములును గుప్త నిధుల తవ్వకాల కేసు విచారణలో భాగంగా పోలీసులు నాలుగు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. ఆ క్రమంలో శ్రీరాములు శుక్రవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై పోలీస్ స్టేషన్లో చనిపోయాడు.

అయితే చెన్నేకొత్తపల్లి లాకప్ డెత్ విషయం తనకు తెలియదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు శనివారం అన్నారు. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి డీజీపీ రాముడు, సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్కే విద్యార్థులు ఉద్యోగాల నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని.. ఓసీలకు వయోపరిమితి పెంచాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం  డీజీపీ విలేకరులతో మాట్లాడుతూ.. పై విధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement