మాతృభాషా దినోత్సవం సందర్భంగా సోమవారం చిత్తూరు జిల్లా పుంగనూరు న్యాయస్థానంలో తెలుగు భాషలో తీర్పును వెలువరించారు.
మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం చిత్తూరు జిల్లా పుంగనూరు న్యాయస్థానంలో తెలుగు భాషలో తీర్పును వెలువరించారు. వివరాలిలా..చౌడేపల్లె మండలం కొలింపల్లెకు చెందిన పి.వెంకట్రమణ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఐదు మందిపై అప్పు తిరిగి చెల్లించలేదని గతేడాది కేసు దాఖలు చేశారు. ఈ కేసును న్యాయస్థానం విచారణ చేపట్టింది. విచారణలో ఇరువర్గాల వాద ప్రతివాదనలు విన్న న్యాయస్థానం సోమవారం తీర్పును వెలువరించింది. కేసులో ఆరోపణలు రుజువుకాకపోవడంతో కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి మోతిలాల్ తీర్పును వెలువరించారు. తీర్పును తెలుగుభాషలో వెలువరించడం విశేషం.